VIRAL VIDEO STUNT DOUBLES BRIDE AND GROOM SET THEMSELVES ON FIRE TO EXIT WEDDING IN STYLE PAH
Shocking: పిచ్చి పీక్స్.. రిసెప్షన్ లో తగలెట్టుకున్నారు.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..
మంటపెట్టుకున్న జంట
Wedding video: పెళ్లికి సంబంధించిన వేల కొలది వీడియోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి. వెడ్డింగ్ లో చోటు చేసుకునే సరదా సంఘటనల కారణంగా అవి వైరల్ అవున్నాయి. ఒక షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చేస్తుంది.
మన దేశంలో పెళ్లిళ్ల ట్రెండ్ (Wedding) మారింది. ఒకప్పటి లాగా సింపుల్ గా పెళ్లిళ్లు చేసుకొవడానికి నేటి యువత (Trend) ఆసక్తి చూంపంచట్లేదు. తమ పెళ్లి ఎల్లకాలం గుర్తుండిపోయేలా చేసుకొవడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. దీని కోసం వెడ్డింగ్ ఆర్గనైజర్ లను కూడా సంప్రదిస్తున్నారు. ప్రీవెడ్డింగ్ (Prewedding) నుంచి మెహందీ, హల్దీ, అప్పగింతలు ప్రతి వేడుక గ్రాండ్ గా చేసుకొవడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. తమ బంధువులు, స్నేహితులకు తమ పెళ్లి ఎంతో సర్ ప్రైజ్ గా, గ్రాండ్ గా చేసుకొవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పెళ్ళిళ్లలో జరిగే ఫన్నీ సంఘటనలు, చిలిపి చేష్టల కారణంగా పెళ్లిళ్లు వైరల్ అవుతున్నాయి.
కొందరు పబ్లిసిటీ కోసం (Publicity) కూడా అనేక స్టంట్ లు చేస్తున్నారు. కొందరు పెళ్లిళ్లలో వేదికమీద.. బైక్ మీద, ఎడ్లబండి, క్రెన్లు వెరైటీగా ఎంట్రీ ఇస్తున్నారు. మరికొందరు పెళ్లిలో తుపాకిపట్టుకుని ఫోటోలకు ఫోజ్ ఇస్తున్నారు. కొన్ని ఎమోషన్ సీన్లు, ఫన్నీ సంఘటనలు పెళ్లిళ్లలో చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం పెళ్లి వేడుకలో.. ఒక షాకింగ్ స్టండ్ వీడియో నెట్టింట తెగ వైరల్ (Viral video) గా మారింది.
పూర్తి వివరాలు.. గేబ్ జెస్సోప్, అంబిర్ బేబిర్ అనే కొత్త జంట పెళ్లి గ్రాండ్ గా జరిగింది. వీరికి రకారకాల స్టంట్ లు అంటే ఎంతో ఇష్టం. తమ పెళ్ళిలో, రిసెప్షన్ లో అతిథులకు దిమ్మతిరిగే షాక్ ఇవ్వాలను కున్నారు. ఇంకేముంది.. వెంటనే ఒక ఐడియా వేశారు. దీని కోసం రిసెప్షన్ వేడుకలో స్టంట్ ను (Fire stunt) ప్లాన్ వేశారు. దీనిలో కొత్త జంట ప్రత్యేకంగా కాస్టూమ్స్ ధరిస్తారు. నిర్వాహకులు దీనికి వెనుక నుంచి నిప్పంటించారు. ఆ తర్వాత వారు పరిగెత్తుకుంటూ అతిథుల దగ్గరకు వచ్చారు. దీంతో అక్కడి వారు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కాసేపటకి తెరుకుని చూడగా.. ఇది స్టండ్ తెలిసింది. కొత్త జంట సరదాగా కింద కూర్చుని అందరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో (Social media) తెగ వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.