• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • VIRAL VIDEO STRAY COWS ATTACK ON DOG AND ITS OWNER INCIDENT CAPTURED ON CCTV NK

CCTV: రెచ్చిపోయిన ఆవులు... కుక్క, దాని యజమానిపై దాడి... వీడియో చూడండి

CCTV: రెచ్చిపోయిన ఆవులు... కుక్క, దాని యజమానిపై దాడి... వీడియో చూడండి

రెచ్చిపోయిన ఆవులు... కుక్క, దాని యజమానిపై దాడి (image credit - twitter)

CCTV Footage: ఆ వీడియో చూసిన వాళ్లంతా ఒకింత భయపడుతున్నారు. ఆవులు కూడా ఈ రేంజ్‌లో కుమ్ముతాయా అని ఆందోళన చెందుతున్నారు. వీడియో చూడండి.

  • Share this:
    గుజరాత్‌... వల్సాద్‌లో జరిగిన దారుణం ఇది. రెండ్రోజుల కిందట... ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కతో... సరదాగా వాకింగ్‌కి వెళ్లాడు. ఓ కూరగాయల మార్కెట్ ముందు నుంచి వెళ్లసాగాడు. ఐతే... ఆ కుక్కకు కొన్ని ఆవులు కనిపించాయి. అవి తమ దారిన ఏవో పారేసిన కూరగాయలను ఏరుకుంటూ తింటూ ఉన్నాయి. వాటి వైపు చూస్తూ... కుక్క గట్టిగా అరిచేసరికి వాటికి ఎక్కడ లేని కంగారు వచ్చేసింది. దాంతో... బాగా బయపడిన ఆవులు అటూ ఇటూ పరుగెడుతూ... చివరకు ఆ కుక్క ఉన్నవైపు వచ్చాయి. ప్రమాదాన్ని పసిగట్టిన కుక్క ఓనర్... దాన్ని నేలపై నుంచి చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ పక్కనే ఉన్న కార్ల పక్కకు వెళ్లి దాక్కోబోయాడు. అప్పటికే తిక్కరేగిన ఓ ఆవు ఆ కుక్కతోపాటూ... అతనిపైనా దాడి చేసింది. కొమ్ములతో కుమ్మేసింది.

    ఇదంతా చూసిన ప్రజలు అతన్ని రక్షించాలనుకునేలోపే... మరో రెండు ఆవులు కూడా దూరాయి. దాంతో మూడు ఆవుల మధ్య అతను నలిగిపోతుంటే... చుట్టుపక్కల జనం గట్టిగా అరుస్తూ ఆవుల్ని తరిమేందుకు ప్రయత్నిస్తూనే... అవి తమ వైపు వస్తాయేమో, తమపై దాడి చేస్తాయేమో అనే టెన్షన్‌తో ఉన్నారు.

    ఇలా 2 నిమిషాలపాటూ అంతా ఉక్కిరి బిక్కిరి అయ్యింది. చివరకు చాలా మంది పోగై... ప్రాణాలకు తెగించి... కర్రలతో కొట్టడంతో... ఆవులు తలో దిక్కుకూ పోయాయి. లక్కీగా కుక్క, దాని యజమానీ... కార్ల సందులోపలికి వెళ్లడంతో... ఆవులు మరీ గట్టిగా దాడి చేయలేకపోయాయని తెలిసింది. వీడియో చూడండి.


    ఇది కూడా చదవండి:దోస్త్ మేరా దోస్త్... 37 ఏళ్లుగా హంసతో స్నేహం చేస్తున్న పెద్దాయన... ఫొటోలు చూడండి

    కొద్దిగా గాయాలపాలైన కుక్క ఓనర్ ఆస్పత్రికి వెళ్లారు. కుక్కకు కూడా చిన్నగా గాయాలు అయ్యాయి. ఈ మొత్తం ఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. వీడియో చూసిన వాళ్లు ఆవుల్ని తక్కువ అంచనా వేయకూడదని అంటున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లోకూడా చాలా చోట్ల ఆవులు ఉంటాయి. వాటి జోలికి వెళ్లకపోతే... అవి ఏమీ చెయ్యవు. అదే తమ జోలికి వెళ్తే మాత్రం ఏమైనా చేయగలవు. ఈ ఘటనలో కూడా కుక్క అరవకుండా ఉండి ఉంటే... అసలు ఇదంతా జరిగేదే కాదు అంటున్నారు నెటిజన్లు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు