Video: సూపర్ మార్కెట్‌లో స్పైడర్‌మేన్!... డిష్యుం..డిష్యుం..!

Video: సూపర్ మార్కెట్‌లో స్పైడర్‌మేన్!... (image credit - twitter)

Viral Video: స్పైడర్‌మేన్ డ్రెస్ వేసుకున్నాడంటే... అతను చాలా జొవియల్ అనుకోవచ్చు. మరి అలాంటి వాడు సడెన్‌గా ఈ వయలెన్స్ ఏంటి? ఎందుకు సూపర్‌మార్కెట్‌లో రెచ్చిపోయాడు?

  • Share this:
    Viral Video: కొన్ని కొన్ని దృశ్యాలు మనకు నచ్చవు. అరెర్రే అనుకుంటాం. అలాంటి దృశ్యాలతో ఓ వీడియో... సోషల్ మీడియాలో ఉంది. అది లండన్‌లోని అస్దా సూపర్ మార్కెట్. అందులోకి స్పైడర్ మేన్ డ్రెస్‌లో వచ్చిన ఓ వ్యక్తి... ఓ మహిళా సిబ్బందిని ముఖంపై గుద్దాడు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అతను అలా ఫైట్ చేస్తాడని, పిడిగుద్దులు గుద్దుతాడని ఎవరూ అనుకోలేదు. చాలా వేగంగా జరిగిన ఈ ఫైట్‌లో మొత్తం ఆరుగురు గాయపడ్డారని తెలిసింది. అతను స్టాఫ్‌ని మాత్రమే కాదు... ఒకరిద్దరు కస్టమర్లను కూడా కొట్టినట్లు తెలిసింది. అసలు ఎందుకు కొట్టాడన్నది సస్పెన్స్ అయ్యింది. కారణమేంటో ఎవరికీ తెలియలేదు.

    ఈ ఘటన జరుగుతున్నప్పుడు... బ్యాక్‌గ్రౌండ్‌లో రకరకాల అరుపులు వినిపిస్తున్నాయి. అక్కడ చూస్తున్నవారే అలా అరిచినట్లు అర్థమవుతోంది. ఈ ఘటనపై తీవ్ర దుమారం రేగింది. మొత్తం ఐదుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు. చాలా మంది చట్టాలు మరింత కఠినంగా ఉండాలి... అప్పుడే ఇలాంటివి జరగకుండా ఉంటాయి అని అంటున్నారు.

    ఆ వీడియోని ఇక్కడ చూడండి.


    అరెస్టైన వారి వయసు 17 నుంచి 37 ఏళ్ల మధ్య ఉందని మెట్రోపాలిటన్ పోలీస్ తెలిపారు. స్పైడర్ మేన్ డ్రెస్ వేసుకున్న వ్యక్తికి 31 ఏళ్లు ఉన్నట్లు తెలిసింది. అతను ఎవర్ని కొట్టాడో ఆ మహిళ చిన్న గాయాలతో ఆస్పత్రిలో చేరింది. ఈ ఘటనకు సంబంధించి ఎవరిదగ్గరైనా మరింత ఫుటేజ్ ఉంటే... తమకు షేర్ చెయ్యమని పోలీసులు అడుగుతున్నారు. తద్వారా ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి వీలవుతుంది అని చెప్పారు.

    సోషల్ మీడియాలో ఈ ఫుటేజ్‌పై భిన్న రకాల కామెంట్లు వస్తున్నాయి. పోలీసులు యాక్షన్ తీసుకోవడంపై కొందరు మెచ్చుకుంటున్నారు. ఈ పుటేజ్ చేస్తూనే తెలుస్తుంది ఎంత గట్టిగా మహిళను కొట్టాడో... అని ఓ యూజర్ ఆవేదన వ్యక్తం చేశారు.

    ఇది కూడా చదవండి: Video: ఈ అమ్మాయిలకు ఏమైంది? ఈ రేంజ్‌లో కొట్టేసుకుంటున్నారు?

    అస్దా సూపర్ మార్కెట్ ఈ ఘటనను ఖండించింది. ఇలాంటి వాటిని సహించే ప్రసక్తే లేదనీ... కస్టమర్లకు, సిబ్బందికీ పూర్తి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది.
    Published by:Krishna Kumar N
    First published: