Home /News /trending /

VIRAL VIDEO SOME PEOPLE HELP A MAN GET RELEASED FROM A GIANT SNAKE GRIP STRANGE VIDEO WILL SHOCK YOU SU

Viral Video: మనిషిని పూర్తిగా చుట్టేసిన కొండ చిలువ.. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.. షాకింగ్ వీడియో

మనిషిని చుట్టేసిన కొండ చిలువ

మనిషిని చుట్టేసిన కొండ చిలువ

ఓ వ్యక్తిని కొండ చిలువ పూర్తిగా చుట్టేసింది. దాని భారీ నుంచి అతడిని తప్పించేందుకు అక్కడున్నవారు తీవ్రంగా ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

    కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారుతుంటాయి. వైరల్‌గా మారుతున్న వాటిలో చాలా వరకు వింతలకు సంబంధించిన వీడియోలు, భయానక వీడియోలు ఉంటాయి. ఇటువంటి వీడియోలు చూసేందుకు నెటిజన్లు కూడా చాలా ఉత్సాహం కనిపిస్తుంటారు. అయితే తాజాగా ఓ కొండచిలువ ఓ వ్యక్తి చుట్టూ పూర్తిగా చుట్టుకుని బంధించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూడటానికి భయానకంగా ఉంది. ఆ వీడియోలో పెద్ద భయంకరమైన కొండ చిలువ వద్ద ఉన్నారు. ఆ సమయంలో అది.. ఓ వ్యక్తిని పూర్తిగా చుట్టివేసింది. ఆ తర్వాత కొండ సంధులోకి అతన్ని లాక్కుని వెళ్లింది. దీంతో అక్కడున్న మిగిలిన వ్యక్తులు దాని బారి నుంచి అతడిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.

    ఆ దృశ్యాలు చూస్తున్న వారు అతడు చనిపోయాడేమోనన్న తీరుగా కొండ చిలువ అతన్ని బంధించింది. అయితే అక్కడున్న వారు పట్టువదలకుండా అతన్ని విడిపించేందుకు ప్రయత్నించారు. అందులో కొందరు కొండ చిలువను పట్టుకుంటే మరికొందరు ఆ వ్యక్తిని బయటకు లాగారు. అయితే కొంతసేపటికి అతడిని కొండచిలువ బారీ నుంచి విడిపించారు. అయితే అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టుగా కనిపించింది.(వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

    అయితే ప్రథమ చికిత్స అనంతరం అతడు స్పృహలోకి వచ్చాడు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంకొద్ది క్షణాలు ఆలస్యమైతే అతడు మరణించేవాడని తెలుస్తోంది. అయితే ఆ తర్వాత కూడా కొందరు కొండచిలువను తమ చేతుల్లోకి తీసుకున్నారు. అనంతరం ముగ్గురు వ్యక్తులు తమ భుజాలపై మోస్తు కొండచిలువను వేరే చోటుకి తీసుకెళ్లారు. The Jungle Books అనే ఫేస్‌బుక్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో మాత్రం పేర్కొనలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది నెటిజన్లు ఈ వీడియోను లైక్ చేస్తున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Python, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు