Home /News /trending /

VIRAL VIDEO SMART DOG SAVES BOY FROM FALLING INTO POND PAH

శునకం చూపిన విశ్వాసానికి నెటిజన్లు ఫిదా.. నెట్టింట వైరల్ అవుతున్న ఆసక్తికర వీడియో..

బాలుడిని కాపాడుతున్న శునకం

బాలుడిని కాపాడుతున్న శునకం

Viral Video: ఒక శునకం తన యజమాని పట్ల ఎంతో విశ్వాసాన్ని చూపించింది. జరగబోయే ప్రమాదాన్ని ముందే గుర్తించింది. వెంటనే అప్రమత్తంగా వ్యవహారించింది. తన విశ్వాసాన్ని చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Smart Dog Saves Boy : శునకాన్ని విశ్వాసానికి గుర్తుగా భావిస్తారు. అందుకే చాలా మంది కుక్కను పెంచుకోవడంలో ఆసక్తి చూపుతుంటారు. ఇవి తమ యజమాని పట్ల ఎంతో ప్రేమను చూపిస్తాయి. ప్రతి నిముషం అవి తమ యజమానిని కనిపెట్టుకుంటాయి. ఏదైన ఆపద వచ్చిన అవి ముందు గానే , తమ ఓనర్ ను అలెర్ట్ చేస్తాయి. చాలా మంది  కుక్కను పెంచుకొవడంలో ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అందుకే జర్మన్ షెపార్డ్, లాబ్రాడర్, ఆల్సేషన్ వంటి జాతులను పెంచుకొంటుంటారు. వీటిని తమ ఇంటిలో ఒక మెంబర్ గా చూసుకుంటారు. దానికి మంచి ఫుడ్ ఇస్తుంటారు.

అదే విధంగా, శునకాలు కూడా తమ యజమాని పట్ల ఎంతో ప్రేమ, విశ్వాసం చూపిస్తుంటాయి. తమ యజమానినే అంటిపెట్టుకుని ఉంటాయి. ఒక వేళ తమ యజమాని... ఎక్కడికైన వెళ్తే.. వేరే వారు పెట్టిన ఆహారాన్ని కూడ తినవు. కుక్కలు కూడా మనిషిలాగే భావోద్వేగాలను కల్గి ఉంటాయి. తమ యజమాని కోసం కన్నీళ్లు కూడా పెట్టుకుంటాయి. ఇక.. బయటివారిని ఇంటి, కొత్త వారిని ఇంట్లో రానీయకుండా కాపాలా కాస్తాయి. నిరంతరం అప్రమత్తంగా ఉంటాయి.



శునకాల విశ్వాసానికి సంబంధించిన  ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. వీటిల్లో తమ యజమానికి ఏదైన అనుకొని ప్రమాదం తలెత్తితే శునకాలు ముందుగా పనిగట్టి కాపాడిన అనేక సంఘటలను మనం వార్తలలో చూశాం. ప్రస్తుతం ఈ కోవకు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

పూర్తి వివరాలు.. ఇద్దరు పిల్లలు తమ పెరడులో వాలీబాల్ ఆడుకుంటున్నారు. అక్కడే ఒక జర్మన్ షెఫర్డ్ కుక్క కూర్చుని వారిని గమనిస్తుంది. ఇద్దరు ఆడుకుంటున్నారు. వారి వెనకాల ఒక చిన్ని స్విమ్మింగ్ పుల్ ఉంది. వారిద్దరు ఆడుకునే టప్పుడు ఆ బాల్ కాస్త వెళ్లి స్విమ్మింగ్ ఫుల్ లో పడింది. అప్పుడు.. ఒక బాలిక వెంటనే తమ పెద్దవారిని పిలవడానికి వెళ్లింది. కానీ బాలుడు మాత్రం ఆ స్విమ్మింగ్ పుల్ దగ్గరకు వెళ్లి దాన్నిబయటకు తీసే ప్రయత్నం చేశాడు. స్విమ్మింగ్ పుల్ తొంగి.. బాల్ ను తీయటానికి ట్రై చేస్తున్నాడు. అప్పుడు.. అక్కడే ఉన్న జర్మన్ షెఫర్డ్ వెంటనే అప్రమత్తమైంది.

వెంటనే బాలుడి దగ్గరకు వెళ్లింది. వెంటనే అతడిని తన నోటితో పట్టుకుని వెనక్కు లాగింది. స్విమ్మింగ్ పుల్ నుంచి దూరంగా బయటకు తీసుకొని వచ్చింది.  అంతే కాకుండా.. అక్కడే పక్కన ఉన్న..   నెట్ లాంటి ఒక కర్రను తన నోటితో పట్టుకుని ఆబాల్ ను బయటకు తీసింది. ఆ తర్వాత.. ఆ బాల్ ను.. బాలుడికి ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు.. మూగజీవి చూపించిన విశ్వాసానికి ఫిదా అవుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Pet dog, Viral Video

తదుపరి వార్తలు