హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్.. ప్రియురాలి కోసం అతగాడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో..

బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్.. ప్రియురాలి కోసం అతగాడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో..

అలిగిన అమ్మాయి

అలిగిన అమ్మాయి

Viral Video: అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో గొడవ పడింది. ఎంతగా బతిమాలిన అసలు పట్టించుకోవడంలేదు. ఎలాగైన తన మనసుకు నచ్చిన గర్ల్ ఫ్రెండ్ ను కూల్ చేయాలనుకున్నాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Kerala, India

మనలో ఎక్కువ మంది యువత ప్రేమ వివాహాలకు ప్రయారిటీ ఇస్తున్నారు. లవ్ మ్యారేజేస్ చేసుకుంటే.. ఒకర్నిమరోకరు బాగా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నారు. అంతే కాకుండా.. ప్రేమలో ఇద్దరి అభిప్రాయాలు, తరచుగా షేర్ చేసుకుంటుంటారు. దీనితో పరస్పరం అభిప్రాయాలు వ్యక్తం చేసుకుంటారని అనుకుంటున్నారు. అందుకే చాలా మంది యువతీ,యువకులు లవ్ మ్యారేజేస్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. కానీ మరికొందరు ప్రేమను తమ అవసరాల కోసం పావుగా వాడుకుంటున్నారు. ప్రేమిస్తున్నామని చెప్పి, ఎదుటి వారిని ముగ్గులోకి దించుతున్నారు. ఆ తర్వాత.. ప్రేమ ముసుగులో అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతున్నారు.

అంతేకాకుండా తమ అవసరాలు తీరిపోయాక బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు. మరికొందరు మాత్రం దీనికి భిన్నంగా తాము ప్రేమించినవారికోసం ఎంతదూరమైన వెళ్తుంటారు. తమ ప్రేమికుల కళ్లలో ఆనందం కోసం ఏమైన చేస్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన సోషల్ మీడియాలో  (Social media) వైరల్ గా మారింది.పూర్తి వివరాలు... అమ్మాయి, అబ్బాయి ఇద్దరు పరస్పరం ప్రేమించుకున్నారు. మరీ ఇద్దరిమధ్య ఏదైన గొడవ జరిగిందో.. మరేంజరిగిందో కానీ అమ్మాయి మాత్రం అలిగి కొండెక్కి కూర్చుంది. అబ్బాయితో మాట్లాడటానికి ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. అయితే.. అబ్బాయి మాత్రం, ఆమెను వదలడంలేదు. ఎన్నోరకాలుగా సముదాయించడానికి ట్రై చేస్తున్నాడు. అంతేకాకుండా.. కాళ్లు పట్టడానికి కూడా వెనుకాడటం లేదు. అయిన ప్రియురాలు మాత్రం కనికరించటం లేదు. చివరకు కాళ్లను కూడా పట్టుకుని, మరీ బతిమిలాడుకున్నాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో మాత్రం వివరాలు లేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా (Viral video)  మారింది.

ఇదిలా ఉండగా దొంగ , పోలీసులకు ఒక రేంజ్ లో చుక్కలు చూపించాడు.

పూర్తి వివరాలు.. ఒక దొంగను పోలీసులు జీప్ లో ఛేజింగ్ చేస్తున్నారు. అతను స్కూటీపై ధూమ్ స్టైల్ లో చక్మా ఇచ్చాడు. అంతే కాకుండా.. పోలీసులకు దొరక్కుండా స్కూటీ మీద కట్స్ కొడుతూ ముప్పుతిప్పలు పెట్టాడు. చివరకు అతగాడు ఒక వంపు మార్గం రాగానే దానిలోపలికి పొనిచ్చాడు. అప్పుడు.. దిమ్మ తిరిగే ఘటన జరిగింది. స్కూటీ మీద ప్రయాణిస్తున్న దొంగ.. మరో మార్గంలోనికి పొనిచ్చాడు. అప్పుడు.. అతనికి ఎదురుగా ఒక సుమో వాహనం ఆగి ఉంది.

అతను వేగంగా వెళ్లి.. వెహికిల్ వెనుక నుంచి యూటర్న్ చేసుకుని వచ్చిన మార్గం గుండా తిరిగి వెళ్లిపోయాడు. పాపం.. పోలీసులు స్కూటీ అంత వేగంగా తమ వాహనం టర్న్ చేయలేక అక్కడే ఉండిపోయారు. అంతే కాకుండా.. పోలీసులు వెహికిల్ దిగి.. అతగాడి కోసం వెనుకవైపుకు వచ్చి మరీ చూశారు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు (Netizens) ఇదేం తెలివిరా నాయన అంటూ కామెంట్ లు పెడుతున్నారు. మరికొందరు వీడిది మాములు బుర్రకాదంటూ నవ్వుతూ ఎమోజీలను పెడుతున్నారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Love affair, Trending video, Viral Video

ఉత్తమ కథలు