Home /News /trending /

VIRAL VIDEO RUSSIAN BALLERINA PERFORMS ON FROZEN WATERS TO SAVE BATAREINAYA BAY FROM CONSTRUCTION PROJECT NETIZENS SUPPORT HER NK GH

Russian ballerina: గడ్డకట్టే చలిలో రష్యా డాన్సర్​అద్భుత ప్రదర్శన... నెటిజన్ల హ్యాట్సాఫ్

గడ్డకట్టే చలిలో రష్యా డాన్సర్​అద్భుత ప్రదర్శన... నెటిజన్ల హ్యాట్సాఫ్ (image credit - Facebook)

గడ్డకట్టే చలిలో రష్యా డాన్సర్​అద్భుత ప్రదర్శన... నెటిజన్ల హ్యాట్సాఫ్ (image credit - Facebook)

Russian ballerina: ఆమె ఎందుకు అలాంటి నృత్య ప్రదర్శన ఇచ్చింది. ఎందుకు ప్రజలు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. ఆ డాన్స్ వెనకున్న అసలు కారణం ఏంటో తెలుసుకుందాం.

కొంతమంది సెలబ్రెటీలు సామాజిక సమస్యల పరిష్కారానికి వినూత్న పంథా ఎంచుకుంటారు. తమదైన రీతిలో స్పందించి, ఆ సమస్య పరిష్కారానికి మద్దతు కూడగడుతారు. తాజాగా, రష్యాకు చెందిన ఒక నృత్య కళాకారిణి కూడా ఇలాంటి వినూత్న పంథానే ఎంచుకుంది. రష్యాలోని ఉత్తమ డ్యాన్సర్‌గా పేరున్న ఇల్మిరా బాగౌటినోవా... గడ్డకట్టే చలిని సైతం లెక్కచేయకుండా బటరేనాయ సరస్సు ఒడ్డున అద్భుత నృత్య ప్రదర్శన ఇచ్చింది. ఆమె ఇలా చేయడానికి వెనుక బలమైన కారణం ఉంది. తాజాగా రష్యా ప్రభుత్వం బటరేనాయ సరస్సు దగ్గర్లో ఓ భారీ థర్మల్​ప్రాజెక్ట్​నిర్మాణాన్ని తలపెట్టింది. దీన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కారణంగా ఒటరేనాయ సరస్సు రమణీయత దెబ్బతింటుందని వారంటున్నారు. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.

ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు ఇల్మిరా బాగౌటినోవా ముందుకొచ్చింది. ఆమె బటరేనాయ సరస్సు ఒడ్డున గడ్డకట్టే చలిని సైతం లెక్కచేకుండా నృత్యప్రదర్శన చేసింది. ఆ ప్రదర్శనను సోషల్ మీడియాలో పోస్ట్​చేసి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి మద్దతు కూడగడుతోంది. ఆమె తన నృత్యాన్ని ఫేస్​బుక్‌లో పోస్ట్​చేస్తూ ‘‘వసంత రుతువులో హంసలు గూడు కట్టుకునే ఒక ప్రత్యేకమైన సహజ, చారిత్రక ప్రదేశంగా గుర్తింపు పొందిన బటరేనాయ సరస్సును మనమంతా రక్షించుకోవాల్సి అవసరం ఉంది. ఎంతో మంది తమ పిల్లలతో కలిసి ఇక్కడికి వచ్చి సేదదీరుతుంటారు. శీతాకాలం వచ్చిందంటే చాలు వందల మంది స్థానిక మత్స్యకారులు వేటకు బయలు దేరుతారు. ఇలాంటి ప్రకృతి సహజ, చారిత్రక ప్రదేశంలో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం ద్వారా ఇవన్నీ విధ్వంసమవుతాయి. కాబట్టి, సరస్సును సహజ స్థితిలోనే ఉంచాలని పిలుపునిస్తూ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కోరుతున్నా. బటరేనాయ సరస్సు పరిరక్షణకై ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ పిటిషన్‌లో సంతకం చేసి స్థానిక ప్రజల ఉద్యమానికి మద్ధతు ప్రకటించాలని రష్యన్​ ప్రజలను కోరుతున్నా.”అని కోరింది.

ప్రాజెక్టు నిర్మాణం ఆపాలని పుతిన్‌కు వినతి:
"నాకు బటరేనాయ సరస్సుతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అందువల్ల ఈ అద్భుతమైన స్థలాన్ని కాపాడేందుకు నా వంతుగా కృషి చేస్తున్నాను. అయితే, నేను ఇక్కడ నృత్యం చేయగానే, ప్రభుత్వం స్పందించి ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేస్తుందని నేను భావించడం లేదు. అది అంత సులభమైన పని కాదని నాకు తెలుసు. అయితే, నా చర్యతో సరస్సు పరిరక్షణకు ప్రజల నుంచి మరింత మద్దతు పెరుగుతుందని భావిస్తున్నా. ఈ అద్భుతమైన సహజ స్థలాన్ని మేము రక్షించగలిగితే అది ఎంతో గొప్ప విజయంగా భావించవచ్చు.” అని అన్నారు.

ఇది కూడా చదవండి: Zomato row: జొమాటో కేసులో ట్విస్ట్... బెంగళూరు నుంచి పారిపోయిన హితేషా...

బాల్టిక్ గ్రెయిన్ టెర్మినల్ సంస్థ సహకారంతో బటరేనాయ సరస్సు వద్ద 5 బిలియన్ల రూబుల్ (477 మిలియన్ డాలర్లు) వెచ్చించి టెర్మినల్ నిర్మాణాన్ని చేపట్టాలని రష్యా ప్రభుత్వం గతేడాది నిర్ణయించింది.
First published:

Tags: VIRAL NEWS, Viral Videos

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు