కొంత మంది చేసే పనులు చాలా చిత్రంగా ఉంటాయి. అసలు వాళ్లు అలా ఎందుకు చేస్తారో అర్థం కాదు. 22 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయన్సర్, మోడల్ అలేస్య కాఫెల్నికోవా అలాంటి పనే చేసింది. ఏనుకుపైకి ఎక్కి నగ్నంగా పోజ్ ఇచ్చింది. ఇండొనేసియాలోని సుమత్రాలో అంతరించిపోయే జాతికి చెందిన ఏనుగు అది. అసలు ఆ ఏనుగు పైకి ఎక్కడమే తప్పు. సరే ఎక్కిందిలే అనుకుంటే... నగ్నంగా ఊరేగడమేంటన్నది నెటిజన్లు ప్రశ్న. ఈ అమ్మడు... ప్రపంచ టెన్నిస్ ప్లేయర్ యూజెనీ కాఫెల్నికోవ్ కూతురు. తండ్రి పేరును చెడగొట్టడానికే పుట్టిందంటున్నారు నెటిజన్లు. ఎవరికి వీలైనట్లు వారు తిట్టిపోస్తున్నారు.
అలేస్య... ఫిబ్రవరి 13న తన ఇన్స్టాగ్రామ్ పేజీపై నేచురల్ వైబ్స్ కాప్షన్‌తో ఏనుగుపై ఊరేగిన వీడియోను అప్లోడ్ చేసింది. అంతే... ఈ రష్యా మోడల్‌పై ప్రపంచవ్యాప్తంగా దుమారం రేగింది. "అయ్యో పాపం ఏనుగు. అలా నగ్నంగా ఏనుగుపైకి ఎక్కడానికి నీకు సిగ్గులేదూ. అది నిజమైన ఏనుగు. బతికి ఉన్న ఏనుగు. డబ్బుతో నీ కళ్లు మూసుకుపోయాయి" అని ఓ నెటిజన్ మండిపడ్డారు.
"ఇదేం బాలేదు. ఏనుగును వదిలేసి... ఏ కుర్చీయో, ఇంకోటో వాడొచ్చుగా. ఇది క్రూరమైన పని" అని మరో యూజర్ క్లాస్ ఇచ్చారు. "నగ్నంగా ఎందుకు? అందరూ నిన్ను నగ్నంగా చూడాలని అనుకుంటారని నువ్వు అనుకుంటున్నావా" అని మరో యూజర్ గడ్డి పెట్టారు.
నెటిజన్లతోపాటూ... జంతు సంరక్షణ సంస్థలు, జంతు హక్కుల పోరాట బృందాలు కూడా ఆమెపై ఫైర్ అయ్యాయి. సేవ్ ది ఆసియన్ ఎలిఫాంట్స్ సంస్థ... ఈ చర్యను ఖండిస్తూ... ఇదో విషాదకర ఘటనగా అభివర్ణించింది.
ఇది కూడా చదవండి:Bhakti: తులసిని ఇలా వాడకండి.. దురదృష్టం వెంటాడుతుంది.
అలేశ్య తన చర్యను సమర్థించుకుంది. సౌందర్య కళాత్మక ఉద్దేశంతోనే ఈ ఫొటోషూట్ చేయించుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతానికి ఆ వీడియోను ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి తీసివేసింది.
Published by:Krishna Kumar N
First published:February 20, 2021, 14:23 IST