హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Indian Railways: కదిలే ట్రైన్ నుంచి కింద పడపోయిన దివ్యాంగుడు.. ప్రాణాలకు తెగించి కాపాడిన రైల్వే సిబ్బంది.. వీడియో వైరల్

Indian Railways: కదిలే ట్రైన్ నుంచి కింద పడపోయిన దివ్యాంగుడు.. ప్రాణాలకు తెగించి కాపాడిన రైల్వే సిబ్బంది.. వీడియో వైరల్

Viral Video: కదిలే రైలులోంచి దిగడం కానీ ఎక్కడం కానీ చేయవద్దని రైల్వే అధికారులు ఎన్ని సార్లు సూచించినా కొందరిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రమాదాల బారిన పడి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా ముంబాయిలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది.

ఇంకా చదవండి ...

  కదిలో రైలులోంచి దిగడం కానీ ఎక్కడం కానీ చేయవద్దని రైల్వే అధికారులు ఎన్ని సార్లు సూచించినా కొందరిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రమాదాల బారిన పడి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. కదిలే రైలులోకి ఎక్కడం, స్పీడ్ గా వెళ్తున్న రైలు నుంచి దిగడం లాంటివి చేస్తూ అదుపు తప్పి కింద పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కొన్ని సంఘటనల్లో RPF సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి కొందరి ప్రాణాలను కాపాడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ముంబైలోని పన్వేల్ రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. ఓ దివ్యాంగుడు వేగంగా వెళ్తున్న రైలులోకి ఎక్కడానికి ప్రయత్నించాడు. కానీ రైలు స్పీడులో ఉండడంతో అతను ఎక్కలేక పోయాడు. దీంతో అదుపు తప్పి అతను కింద పడబోయాడు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న ఓ RPF సిబ్బంది గమనించాడు. దీంతో అతను వేగంగా పరిగెత్తి ఆ దివ్వాంగుడిని ఫ్లాట్ ఫామ్ వైపుకు లాగాడు. దీంతో అతను ఫ్లాట్ ఫామ్ పై పడ్డాడు.

  ఆర్పీఎఫ్ సిబ్బంది ఈ విషయాన్ని గమనించి పక్కకు లాగక పోతే అతను రైలు, ప్లాట్ ఫాం మధ్యలో కింద పడేవాడు. ఈ ఘటన స్టేషన్లో ఉన్న ఓ సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ వీడియోను Ministry of Railways తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. దివ్యాంగుడి ప్రాణాలను కాపాడిన ఆర్పీఎఫ్ సిబ్బందిని అభినందనల్లో ముంచెత్తుతున్నారు. గుడ్ జాబ్, గ్రేట్ అంటూ ఆ అధికారిని అభినందిస్తున్నారు.

  ఈ అంశంపై రైల్వే శాఖ స్పందిస్తూ కదిలే రైలులో ఎక్కడానికి లేదా దిగడానికి ప్రయత్నించవద్దని ప్రయాణికులకు మరో సారి సూచించింది. ఇలా చేయడం ప్రాణాంతకమని హెచ్చరించింది. ప్రయాణికులు ఇలాంటి ప్రమాదకరమైన పని చేయవద్దని కోరింది.

  First published:

  Tags: Indian Railway, Indian Railways, Mumbai, Viral Video, Viral Videos

  ఉత్తమ కథలు