VIRAL VIDEO RPF JAWAN RESCUED A PASSENGER WHO FELL DOWN ON THE RAILWAY PLATFORM NS
Viral Video: వామ్మో.. అదృష్టం అంటే అతనిదే.. ఆ జవాన్ రావడం అర క్షణం ఆలస్యమైనా..
రైలు నుంచి కింద పడబోయిన ప్రయాణికుడిని కాపాడుతున్న రైల్వే సిబ్బంది (ఫొటో:ట్విట్టర్/ANI)
రైల్వే (Indian Railway) అధికారులు తాజాగా విడుదల చేసిన ఓ వీడియో వైరల్ గా మారింది. పరిగెత్తే రైలు నుంచి కింద పడబోయిన ప్రయాణికుడిని కాపాడిన జవాన్ సహాసానికి నెటిజన్లు సలాం కొడుతున్నారు. ఆ వీడియో మీరు కూడా చూడండి...
పరిగెత్తే రైలును (Train) ఎక్కే ప్రయత్నం లేదా అలాంటి రైలు నుంచి దిగే ప్రయత్నం చేయొద్దంటూ రైల్వే అధికారులు, మీడియా ఎంత మొత్తుకుంటున్నా.. కొందరు మాత్రం అతివిశ్వాసంతో అలా ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారు అనేకం. అదృష్టం కొద్దీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుని ప్రాణాలు దక్కించుకున్న వారు కూడా ఉన్నారు. అయితే.. ప్రస్తుతం సీసీ కెమెరాలు అన్ని స్టేషన్లలో ఏర్పాటు చేయడంతో రైల్వే అధికారులు ఇలాంటి ఘటనలకు సంబంధించి వీడియోలను (Viral Video) బయటకు విడుదల చేస్తున్నారు. తాజాగా ఇలాంటి వీడియోను రైల్వే అధికారులు విడుదల చేశారు. మహారాష్ట్రలోని (Maharashtra) వాసాయి రైల్వే స్టేషన్లో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. ఓ వ్యక్తి వేగంగా వెళ్తున్న ట్రైన్ ను ఎక్కేందుకు ప్రయత్నించాడు. రైలు చాలా వేగంగా వెళ్తుండడంతో అతని ప్రయత్నం విఫలమైంది. దీంతో ప్లాట్ ఫామ్, ట్రైన్ కు మధ్యలో పడ్డాడు.
కొన్ని సెకన్ల పాటు అతను అలాగే ట్రైన్ ప్లాట్ ఫామ్, రైలు మధ్యలో ఉండిపోయాడు. అయితే అక్కడే ఉన్న RPF(రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్) జవాన్ అతడిని గమనించాడు. వెంటనే వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి బాధితుడిని ప్లాట్ ఫామ్ మీదకు లాగేశాడు. దీంతో అతడు ప్రాణాలతో బయట పడ్డాడు. అయితే.. ఈ ఘటనలో అతడికి ఎలాంటి గాయాలు కూడా కాకపోవడం విశేషం. రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ సిబ్బంది ఇలాంటి అనేక ఘటనల్లో చాలా మంది ప్రయాణికులను కాపాడారు. సెకండ్ల వ్యవధిలోనే బాధితులను ప్లాట్ ఫామ్ మీదకు లాగి వారికి పునర్జన్మ అందించారు. Hero Venkatesh-TSRTC: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన హీరో వెంకటేష్ కుటుంబం.. వీడియో షేర్ చేసిన సజ్జనార్.. ఇదిగో వీడియో
#WATCH | Maharashtra: An RPF (Railway Protection Force) jawan rescued a passenger who fell down on the railway platform while trying to board a moving train at Vasai Railway Station on 23rd January. pic.twitter.com/Pxy2u467ZJ
అయితే.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ సిబ్బందికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మీరు రియల్ హీరో అంటూ నెటిజన్ల నుంచి అభినందనల వర్షం కురుస్తోంది. మీ సహాసానికి సెల్యూట్ అంటూ మరి కొందరు పోస్టులు పెడుతున్నారు. మీరు కూడా ఇలా పరిగెత్తే రైలును ఎక్కడానికి ప్రయత్నించి ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. జర్నీ మిస్ అయినా పర్వాలేదు కానీ.. ప్రాణాలు పోతే మళ్లీ తెచ్చుకోలేం కదా!
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.