Video: టామ్ అండ్ జెర్రీ చూసిన పిల్లి. ఏం చేసిందో చూస్తే నవ్వే నవ్వు!

టామ్ అండ్ జెర్రీ చూస్తున్న పిల్లి పిల్ల (image credit - twiter)

Viral Video: పిల్లులు ఒక్కోసారి కావాలని అమాయకత్వం నటిస్తాయి. ఇతరులు తమను చూస్తూ ఉంటే... అమాయకపు ఫేస్ పెట్టి ఆడుకుంటూ ఆకట్టుకుంటాయి. మరి ఆ పిల్లి టామ్ అండ్ జెర్రీ చూసి ఏం చేసింది.

  • Share this:
    Viral Video: టీవీలో టామ్ అండ్ జెర్రీ కార్టూన్ నచ్చని వారు దాదాపు ఉండరు. ఎలుక జెర్రీని తినేయాలని పిల్లి టామ్ వేసే అమాయకపు ఎత్తుగడలు... వాటిని చిత్తు చేస్తూ టామ్‌కి షాకులిచ్చే జెర్రీ ప్లాన్స్ ఎప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంటాయి. పిల్లలకే కాదు... పెద్దలకూ ఈ యానిమేషన్ సిరీస్ చాలా ఇష్టం. మరి ఇలాంటి ఎపిసోడ్‌ని ఓ నిజమైన పిల్లి చూస్తే ఏమవుతుంది అనేదానికి సమాధానం దొరికేసింది. మాజీ బాస్కెట్ బాల్ ప్లేయరైన రెక్స్ చాప్‌మాన్ ఇప్పటికే ఎన్నో రకాల వైరల్ వీడియోలను నెటిజన్లకు చూపించి అలరించారు. తాజాగా మరో వీడియోను అందించారు. ఇందులో... ఓ పిల్లి పిల్ల... టీవీలో వచ్చే టామ్ అండ్ జెర్రీ ప్రోగ్రామ్ ఆసక్తిగా చూసింది.

    పిల్లి చూస్తున్న సమయంలో... జెర్రీ... తన చేతిని బెలూన్‌లాగా ఉది... పెద్దగా చేసి... ఆ చేత్తో... టామ్‌కి గట్టిగా పంచ్ ఇచ్చింది. ఆ సమయంలో... చెంప దెబ్బ సౌండ్ ఓ రేంజ్‌లో వచ్చింది. అది విన్న పిల్లి... వామ్మో అని ఎగిరిపడి... అక్కడి నుంచి పరుగో పరుగు... మాటలెందుకు మీరే ఆ వీడియో చూసేస్తే సరి.

    ఈ వీడియోని ఇక్కడ చూడండి.


    ఈ వీడియో క్లిప్ నెటిజన్లకు ఎంత బాగా నచ్చుతోందంటే... ఒక్కొక్కరు నాలుగైదు సార్లు చూస్తున్నారు. అందుకే దీనికి రెండు రోజుల్లోనే 15 లక్షల వ్యూస్ వచ్చాయి. లైక్స్, షేర్స్, కామెంట్స్ అబ్బో లెక్క లేదు.

    ఇది కూడా చదవండి: Video: సూపర్ మార్కెట్‌లో స్పైడర్‌మేన్!... డిష్యుం..డిష్యుం..!

    ఇది కూడా చదవండి: Video: ఈ అమ్మాయిలకు ఏమైంది? ఈ రేంజ్‌లో కొట్టేసుకుంటున్నారు?

    ఈ కరోనా రోజుల్లో మనుషులతో ఎక్కువగా కలిసే పరిస్థితి లేదు. ఇలాంటప్పుడు సరదాగా నాలుగు మాటలు చెప్పుకునే అవకాశాలు తగ్గిపోయాయి. అందువల్ల కాస్త మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు ఇలాంటి వైరల్ వీడియోలు చూడటం మంచిదే అంటున్నారు నిపుణులు. ఇవి మనలో ఒత్తిడిని తగ్గించి... ఆరోగ్యాన్ని పెంచుతాయని చెబుతున్నారు. వీటిని చూసేటప్పుడు ఎంత వీలైతే అంత స్వేచ్ఛగా, పగలబడి నవ్వేయమని సూచిస్తున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: