మానవ జీవితం.. బుద్బుదప్రాయం, క్షణభంగురం అంటారు సంత్ కబీర్. ఆయన చెప్పినట్టు.. పుట్టుక నుండి మరణం దాకా సాగే ప్రయాణంలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేరనే వాదనతో ప్రపంచంలో ఏ మానవుడూ విభేదించడేడు. జీవితం క్షణాల్లోనే అటు ఇటయ్యే సందర్బాలు ఎన్నో చూస్తుంటాం. సదరు ఘటనలు రికార్డులకు చిక్కడం కూడా అరుదైన విషయమే. తాజాగా అమెరికాలో జరిగిన ఓ ప్రమాదంలోనూ ‘జీవితం క్షణభంగురం’ తరహా సీన్ చోటుచేసుకుంది. యాక్షన్ థ్రిల్లర్ సీక్వెన్సుకు ఏమాత్రం తీసిపోని ఆ దృశ్యాల తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది...
అతను ప్రయాణించిన చిన్న విమానంలో సడన్ గా సాంకేతిక లోపం తలెత్తింది.. ప్రమాదకర ఎమర్జెన్సీ ల్యాండింగ్ తప్ప మరోదారి లేదు.. ప్రాణాలను పణంగాపెట్టి ఆ పని చేశాడు పైలట్.. తీరా చూస్తే ఆ విమానం రైలు పట్టాలపై క్రాష్ అయింది.. గాయాలతో బయట పడ్డాననుకున్న పైలట్ పైకి ట్రైన్ రూపంలో మృత్యుదేవత దూసుకొచ్చింది.. నుజ్జునుజ్జయిన విమానంలో ఇరుక్కుపోయి ఇక చావుతప్పదనుకునే లోపు.. ఒకే ఒక్క సెకన్ వ్యవధిలో పోలీస్ అధికారి పైలట్ ను బయటికి లాగడంతో ప్రాణాలు నిలిచాయి.. మరుక్షణంలో విమానాన్ని రైలు తునాతునకలు చేసేసింది.. కాలిఫోర్నియా రాష్ట్రంలోని ప్రఖ్యాత లాస్ ఏజెల్స్ సిటీలో చోటుచేసుకుందీ ఘటన..
అమెరికాలో న్యూయార్క్ తర్వాత రెండో అతిపెద్ద నగరం, కాలిఫోర్నియా రాష్ట్రంలో పెద్ద నగరమైన లాస్ ఏంజెల్స్ లో ఆదివారం అనూహ్య ప్రమాదం జరిగిది. సిటీ శివారు ఫుల్ హిల్ డివిజన్ వద్ద రైలు పట్టాలపై ఓ చిన్నపాటి విమానం(సెస్నా 72 మోడల్) కూలిపోయింది. స్థానిక ఫెర్నాండో వెల్లి కమ్యూనిటీ నుంచి టేకాఫైన చిన్న విమానం.. ఫుట్ హిల్ వద్ద రైల్వే ట్రాక్ పై కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడికి సమీపంగా ఉన్న ఓ పోలీస్ బృందం హుటాహుటిన పట్టాల దగ్గరికి చేరుకుంది..
Foothill Division Officers displayed heroism and quick action by saving the life of a pilot who made an emergency landing on the railroad tracks at San Fernando Rd. and Osborne St., just before an oncoming train collided with the aircraft. pic.twitter.com/DDxtGGIIMo
— LAPD HQ (@LAPDHQ) January 10, 2022
ఎత్తు నుంచి కూలిపోయిన విమానం నుజ్జుయిపోవడంతో విమానాన్ని నడిపిన వ్యక్తి అందులోనే ఇరుక్కుపోయాడు. కనీసం విమానాన్ని అయినా కదిలిద్దామంటే అది పూర్తిగా పట్టలకు చిక్కుకుపోయింది. నలుగురు పోలీసులు కలిసి పైలట్ ను కాపాడే ప్రయత్నం చేస్తుండగానే.. ఆ ట్రాక్ వెంబడి దూసుకొస్తోన్న రైలు కూతపెట్టింది. రైలు అంతకంతకూ దగ్గరవుతున్నా, పోలీస్ అధికారులు ప్రాణాలకు తెగించి ఆఖరి సెకన్ లో పైలట్ ను కాపాడగలిగారు. పోలీసుల బాడీ కెమెరాలో రికార్డయిన ఈ దృశ్యాలను లాస్ ఏజెల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ (ఎల్ఏపీడీ) విడుదల చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Plane Crash, USA, Viral Video