హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral video: పైలెట్ చేసిన అద్భుత విన్యాసానికి నెటిజన్లు ఫిదా.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న వీడియో..

Viral video: పైలెట్ చేసిన అద్భుత విన్యాసానికి నెటిజన్లు ఫిదా.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న వీడియో..

రెడ్ బుల్

రెడ్ బుల్

Viral video: సాధారణంగా పైలెట్లు ఎన్నో సాహసోపేత విన్యాసాలు చేస్తుంటారు. వారు విమానాలు, హెలికాప్టర్లతో చేసే స్టంట్స్ మనల్ని బాగా ఆకట్టుకుంటాయి. ఒక్కోసారి వారు చేసే ఎయిర్ షో చూస్తే.. హార్ట్ బీట్ పెరిగిపోతుంది. గాల్లో అత్యంత వేగంగా వెళ్తూ పైలట్లు చేసే రిస్కీ స్టంట్స్ వెన్నులో వణుకు పుట్టిస్తాయి. తాజాగా కూడా ఒక పైలెట్ చేసిన విన్యాసం నెటిజన్లను నోరెళ్ళబెట్టేలా చేస్తోంది.

ఇంకా చదవండి ...

సాధారణంగా పైలెట్లు(Pilot) ఎన్నో సాహసోపేత విన్యాసాలు చేస్తుంటారు. వారు విమానాలు, హెలికాప్టర్లతో చేసే స్టంట్స్ మనల్ని బాగా ఆకట్టుకుంటాయి. ఒక్కోసారి వారు చేసే ఎయిర్ షో(AirShow) చూస్తే.. హార్ట్ బీట్(Heart Beat) పెరిగిపోతుంది. గాల్లో అత్యంత వేగంగా వెళ్తూ పైలట్లు చేసే రిస్కీ స్టంట్స్ వెన్నులో వణుకు పుట్టిస్తాయి. తాజాగా కూడా ఒక పైలెట్ చేసిన విన్యాసం నెటిజన్లను నోరెళ్ళబెట్టేలా చేస్తోంది. అతడు చేసిన విన్యాసానికి సంబంధించిన వీడియోని ప్రముఖ ఎనర్జీ డ్రింక్ కంపెనీ రెడ్ బుల్ (Red Bull) ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. అయితే ఈ వీడియోని ప్రతి నెటిజన్ కూడా కన్నార్పకుండా.. ఊపిరి బిగబట్టి మరీ చూస్తూ ఆశ్చర్యపోతున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఇటాలియన్ పైలట్ డారియో కోస్టా టర్కీలో ఉన్న రెండు సొరంగాల గుండా రెడ్ బుల్ ప్లేన్‌తో అద్భుతమైన విన్యాసాలు చేశాడు. సెప్టెంబర్ 4 తెల్లవారుజామున టర్కీలోని కాటాల్కా సొరంగాల గుండా 250 కిలోమీటర్ల వేగంతో తన రేసు విమానంతో దూసుకెళ్లాడు. ఈ విషయాన్ని రెడ్ బుల్ కంపెనీ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. రెండు సొరంగాల ద్వారా ప్లేన్ నడిపిన మొదటి వ్యక్తిగా డారియో కోస్టా రికార్డు సృష్టించాడని కంపెనీ వెల్లడించింది.

Lung Cancer: పొగతాగే వారికే కాదు.. పొగతాగని వారికి కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్.. తాజా పరిశోధనలో ఏం తేలిందంటే..

అయితే ఈ అరుదైన విన్యాసాన్ని చేసి చూపించిన పైలెట్ డారియో మీడియాతో తన అనుభవాన్ని పంచుకున్నాడు. "విన్యాసం చేస్తున్నప్పుడు ప్రతిదీ చాలా వేగంగా జరిగిపోతున్నట్లు అనిపించింది. మొదటి సొరంగం నుంచి విజయవంతంగా బయటికి వచ్చిన తర్వాత బాగా గాలి వీచింది.

దాంతో నా ప్లేన్ ఒక్కసారిగా కుడివైపుకి కదలడం ప్రారంభించింది. ఆ క్షణంలో నా మైండ్‌లో ప్రతిదీ నెమ్మదించింది. వెంటనే అప్రమత్తమైన నేను రెండో సొరంగంలోకి ప్రవేశించేందుకు నా మార్గం పై దృష్టి సాధించాను. ఆ తర్వాత అన్ని వేగవంతమయ్యాయి" అని డారియో కోస్టా చెప్పుకొచ్చారు.

Viral News: ఫ్రీ వైఫై అంటూ కస్టమర్లకు దిమ్మతిరిగే షాక్ ఇస్తోన్న రెస్టారెంట్.. పాస్‌వర్డ్‌గా ఏం పెట్టారంటే..

డారియో కోస్టా రెండు సొరంగాల ద్వారా విన్యాసాలు చేసిన మొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించడమే కాదు ఎయిర్ ప్లేన్ తో పొడవైన సొరంగం గుండా (Longest tunnel flown) ప్రయాణించిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించాడు. ఈ వీడియోకి ఇప్పటికే దాదాపు ఏడు లక్షల వ్యూస్ వచ్చాయి.

14 వేల లైకులు వచ్చాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి విన్యాసాలు చేయడం అవసరమా? జరగరానిది ఏదైనా జరిగితే ప్రాణాలు వెనక్కి తెచ్చి ఇవ్వగలరా? అని ఒక నెటిజన్ రెడ్ బుల్ కంపెనీ పై అసహనం వ్యక్తం చేశారు. ఈ విన్యాసం అదిరిపోయిందని ఇంకొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Published by:Veera Babu
First published:

Tags: Pilot, VIRAL NEWS, Viral Video

ఉత్తమ కథలు