హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video : రైలులో ఫోన్ చోరికి యత్నించి ప్రయాణికులు చేసిన పనికి బిత్తరపోయిన దొంగ..దణ్ణం పెడతా వదలొద్దంటూ వేడుకోలు

Viral Video : రైలులో ఫోన్ చోరికి యత్నించి ప్రయాణికులు చేసిన పనికి బిత్తరపోయిన దొంగ..దణ్ణం పెడతా వదలొద్దంటూ వేడుకోలు

రైలు కిటికీకి ప్రమాదకరంగా వేలాడుతున్న దొంగ

రైలు కిటికీకి ప్రమాదకరంగా వేలాడుతున్న దొంగ

Thief Dangles From Train Window : రైలు ప్రయాణంలో(Train Journey) చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డోర్ దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడేవాళ్లు అదేవిధంగా కిటీకి పక్కన కూర్చున్నవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. రైలు స్టేషన్ కు చేరుకుంటున్న సమయంలో కొందరు దొంగలు పరుగెత్తుకుంటూ వచ్చి కిటికీలోనుంచి లోపలికి చేతులుపెట్టి మన పర్సు లేదా ఫోన్ లు కొట్టేస్తుంటారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Thief Dangles From Train Window : రైలు ప్రయాణంలో(Train Journey) చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డోర్ దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడేవాళ్లు అదేవిధంగా కిటీకి పక్కన కూర్చున్నవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. రైలు స్టేషన్ కు చేరుకుంటున్న సమయంలో కొందరు దొంగలు పరుగెత్తుకుంటూ వచ్చి కిటికీలోనుంచి లోపలికి చేతులుపెట్టి మన పర్సు లేదా ఫోన్ లు కొట్టేస్తుంటారు. దేశరాజధాని ఢిల్లీ రైల్వేస్టేషన్ సహా దేశంలోని చాలా రైల్వే స్టేషన్(Railway Station) ల దగ్గర రైలు కొంచెం స్లో అయిన సమయంలో దొంగలు కిటికీల్లో నుంచ చేతులు లోనికిపెట్టి ఏది దొరికితే అది ఎత్తుకుపోవడం చేస్తుంటారు. అయితే తాజాగా ఓ దొంగ(Thief) కూడా అలాగే సెల్‌ఫోన్‌(Phone) ను దొంగలించడానికి ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. కొన్ని నిమిషాల పాటు నరకయాతన అనుభవించాడు. ఎవరైనా దొంగ దొంగతనం చేస్తుండగా దొరికిపోతే ప్లీజ్ వదిలేయండి అని వేడుకోవడం సహజం. కానీ ఈ దొంగ మాత్రం మీకు దణ్ణం పెడతా నన్ను వదిలిపెట్టవద్దు అంటూ ప్రయాణికులను వేడుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్(Viral Video) అవుతోంది.

అసలేం జరిగిందంటే

బీహార్(Bihar) లో నేరాలు ఎక్కువగా జరుగుతుంటాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నెల 14వ తేదీన బీహార్ లోని బెగుసరాయ్ నుంచి ఖగారియాకు వెళ్తున్న రైలు సాహెబ్‌పూర్ కమల్ స్టేషన్ దగ్గర ఆగింది. అయితే కొద్దిసేపటి తర్వాత రైలు మళ్లీ స్టార్ట్ అయింది. అయితే వెంటనే ఓ దొంగ ఆ రైలు బోగి కిటికీ నుంచి ఒక ప్రయాణికుడి ఫోన్‌ను దొంగలించడానికి ప్రయత్నించాడు. అయితే అప్రమత్తంగా ఉన్న ప్రయాణికుడు ఆ దొంగ చేతులను గట్టిగా పట్టేసుకున్నారు. ప్లాట్‌ ఫామ్‌ చివరకు చేరుతున్న సమయంలో రైలు వేగం పెరిగింది. దీంతో తనను క్షమించి వదిలేయమని ఆ దొంగ ప్రాధేయపడ్డాడు. అయినప్పటికీ దొంగ చేతులను ప్రయాణికుడు విడిచిపెట్టలేదు. అతని చేతులను గట్టిగా లోపలకు లాగి పట్టుకున్నాడు. దీంతో ఆ దొంగ కంపార్ట్‌మెంట్‌ కిటికీ బయటవైపు ప్రమాదకరంగా వేలాడాడు.

Viral Video : ఇదెక్కడి మ్యాజిక్ రా మామ..ఖాళీ చైర్ లో గుడ్డ వేయగానే అమ్మాయి ప్రత్యక్షం!

ఈ క్ర‌మంలో ఆ దొంగ తనను వదిలిపెట్టవద్దని, లేకుంటే చనిపోతాను అంటూ ప్రయాణికులను వేడుకున్నాడు. ఆ దొంగపై జాలిపడిన ప్రయాణికులు ఆ దొంగను గట్టిగా పట్టుకున్నారు. ప్లీజ్ నా చేతులు వదలవద్దు,నన్ను పట్టుకోండి అంటూ కొద్దిసేపు నరకయాతన అనుభవించాడు ఆ దొంగ. రైలు పది కిలో మీటర్లు వెళ్లేవరకూ అలా ప్రమాదకరంగా వేలాడుతూనే ఉన్నాడు.

ఆ రైలు పది కిలో మీటర్ల దూరం ప్రయాణించి ఖగారియా స్టేషన్‌ సమీపిస్తుండగా ఆ దొంగ చేతులను ప్రయాణికులు విడిచిపెట్టారు. దీంతో ఆ దొంగ బతుకు జీవుడా అని ప్రాణాలు చేతిలో పెట్టుకుని అక్క‌డి నుంచి ప‌రుగులు తీశారు. ఈ సంఘటనంతా ఆ రైల్లో ఉన్న మరికొందరు తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెట్టిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Bihar, Train, Viral Video

ఉత్తమ కథలు