Video: వామ్మో.. విమానంలో సిగరెట్ వెలిగించుకొని నిద్రపోయాడు

Video: వామ్మో.. విమానంలో సిగరెట్ వెలిగించుకొని నిద్రపోయాడు (image credit - youtube)

Viral Video: బస్సులు, రైళ్లలోనే పొగ తాగరాదని చెబుతారు. అలాంటిది... విమానంలో సిగరెట్ వెలిగించుకున్నాడు. ఇంకేమనాలి... ఆ తర్వాత ఏమైందో తెలుసుకుందాం.

  • Share this:
    Video: సిగరెట్ తాగేవాళ్లకు ఓ అలవాటు ఉంటుంది. ఫలానా టైమ్‌కి అది తాగకపోతే... బుర్ర పట్టేసినట్లు... నాలిక పీకేసినట్లు ఫీలవుతారు. చేసే పని ఆపేసి మరీ బయటకు వెళ్లి దమ్ముకొడతారు. అలా గుప్పుగుప్పున పొగ వదిలితేనే రిలాక్స్ ఫీలవుతారు. పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అని వారికీ తెలుసు... కానీ ఆ అలవాటుకు బానిసలై దాన్ని ఎలా వదిలించుకోవాలో తెలియక సరెండర్ అయిపోతుంటారు. ఓ విమాన ప్రయాణికుడు అదే చేశాడు. గాల్లో విమానం వెళ్తుంటే... ఉన్నట్టుండి... సిగరెట్ తీశాడు. లైటర్‌తో హాయిగా వెలిగించుకున్నాడు. ఓసారి గట్టిగా దమ్ము లాగి... సైలెంట్‌గా పొగ వదిలి... రిలాక్స్ ఫీల్ అయ్యాడు. మెల్లగా నిద్రలోకి జారుకుంటున్నాడు.

    అతను సిగరెట్ వెలిగించుకోవడం, కాల్చడం అన్నీ పక్కనున్న ప్రయాణికులు చూశారు. ఆ సమయంలో స్పిరట్ ఎయిర్‌లైన్స్ (Spirit Airlines) విమానం మిన్నెసొటాలోని మిన్నెపొలిస్‌కు వెళ్తోంది. ఆగ్రహించిన తోటి ప్రయాణికులు... వెంటనే ఫ్లైట్ అటెండెంట్‌కు చెప్పారు. వారు వచ్చి... విమానంలో సిగరెట్ తాగకూడదని తెలియదా... అంటూ... సిగరెట్ ఆర్పేసి... దాన్ని సీట్ ట్రేలో పడేశారు. అతనేమో... తలంతా పట్టేసింది... అందుకే కాల్చానని చెప్పాడు.

    ఆ మహిళా ప్రయాణికురాలు ఇదంతా వీడియో తీసింది. ఆ వీడియోను ఇక్కడ చూడండి.

    నిజానికి ఇది ఇప్పుడు జరిగిన ఘటన కాదు. 2019 మేలో జరిగింది. ఆ వీడియోని ఎవరో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేశారు. దాంతో అది మళ్లీ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ చివరకు ఏం జరిగిందన్నది మనకు తెలియాలి కదా. విమానం ఆగిన తర్వాత... ఆ ప్రయాణికుణ్ని అరెస్టు చేశారు.

    ఇది కూడా చదవండి: Zodiac signs: ఏ రాశి వారు ఏ రంగు రాళ్లను ధరించాలి?

    విమానంలో సిగరెట్లు తాగకూడదు. విమానాల్లో స్మోక్ డిటెక్టర్లు ఉంటాయి. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగి... లేదా ఎలక్ట్రిసిటీ ప్రమాదాలు జరిగి పొగ వస్తే... స్మోక్ డిటెక్టర్లు వెంటనే కనిపెట్టి... పైలట్లను అలర్ట్ చేస్తాయి. ఇక్కడ ఆ ప్రయాణికుడు ఒక్కసారే దమ్ము కొట్టడం వల్ల ఎక్కువ పొగ రాలేదు. కాబట్టి... మ్యాటర్ ఎక్కువ సీరియస్ అవ్వలేదు. ఇది పెద్ద తప్పే కావడంతో... అరెస్టు తప్పలేదు.
    Published by:Krishna Kumar N
    First published: