హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

కూతురి కాళ్లను పాలతో కడిగిన తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే.. వీడియో వైరల్..

కూతురి కాళ్లను పాలతో కడిగిన తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే.. వీడియో వైరల్..

కూతురి పాదాలకు పూజ చేస్తున్న తల్లిదండ్రులు

కూతురి పాదాలకు పూజ చేస్తున్న తల్లిదండ్రులు

Viral video: తల్లిదండ్రులు తమ కూతురుపై ఉన్న ప్రేమను వినూత్నంగా చూపించారు. ఆమె పుట్టడంతోనే అన్నివిధాల కలసి వచ్చిందని, కుర్చీలో కూర్చుండ బెట్టారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Tamil Nadu, India

మనలో చాలా మంది ఇప్పటికి అమ్మాయి పట్ల వివక్షత చూపిస్తుంటారు. ఆడపిల్ల పుడితే ఆనందించాల్సింది పోయి.. కొందరు గొడవలు పెట్టుకుంటుంటారు. కోడలుని నానా రకాలుగా వేధిస్తుంటారు. మరికొందరు ప్రెగ్నెంట్ కాగానే ఎక్స్ రే లు కూడా తీయిస్తుంటారు. పొరపాటున ఆడపిల్ల ఉంటే వెంటనే అబార్షన్ కూడా చేయిస్తుంటారు. ఇంకొందరు నీచులు.. ఆడపిల్ల పుడితే ఎక్కడైన వదిలేయడం కూడా చేస్తుంటారు. ప్రభుత్వాలు అమ్మాయిల పట్ల వివక్షత రూపుమాపడానికి ఎన్నిచట్టాలు తీసుకొచ్చిన ఇప్పటికి కొంత మంది మాత్రం మారడం లేదు.


కానీ దీనికి భిన్నంగా కొందరు మాత్రం అమ్మాయి పుడితే అమ్మవారి స్వరూపంగా భావిస్తుంటారు. ఇప్పటికే కొందరు విమానంలో తమ కూతురుని గ్రాండ్ గా తొలిసారి ఇంటికి తీసుకొచ్చారు. అదే విధంగా మరోక చోట.. తమ కూతురి పాదాలను కుంకుమలో ముంచి తాను కష్టపడి తీసుకున్న వాహనం మీద కాలి ముద్రలు వేసుకున్న అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి. తాజాగా, మరోక ఘటన వెలుగులోనికి వచ్చింది.

పూర్తి వివరాలు.. తల్లిదండ్రులు తమ కూతురు పట్ల తమకున్న ప్రేమను వినూత్నంగా చూపించాలనుకున్నారు. దీనికోసం వారు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. తమ కూతురుని తల్లిదండ్రులు ఒక చెయిర్ లో కూర్చుండబెట్టారు. పెద్ద స్టీల్ పాత్రలో ఆమె పాదాలు పెట్టారు. అంతే కాకుండా.. ఆమె పాదాలను తల్లిదండ్రులిద్దరు పాదాలతో కడిగారు.


ఆ తర్వాత.. ముందర ఒక తెలుపు రంగు టవల్ ను పెట్టారు. మరో పాత్రలో కుంకుమ నీళ్లను పెట్టారు. దానిలో ఆమె పాదాలను ముంచి, తెలుపు రంగు టవల్ పైన పెట్టేలా చేశారు. అక్కడ కూడా ఆమె ముద్రలను తీసుకున్నారు. ఈ విధంగా తమ కూతురిపట్ల తమ ప్రేమను చాటు కున్నారు. ఈ వీడియోను.. ఐఏఎస్ అధికారి సంజయ్ కుమార్ ఎమోషనల్ మూమెంట్ అంటూ ట్విటర్ లో ట్యాగ్ ను జతపర్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా (viral video)  మారింది.Published by:Paresh Inamdar
First published:

Tags: Viral Video

ఉత్తమ కథలు