Home /News /trending /

VIRAL VIDEO ORANGUTAN HOLDS ONTO MANS LEG AT INDONESIA ZOO TRIES TO BITE FOOT PAH

OMG: వ్యక్తి వెకిలి చేష్టలు.. జూలో సుస్సు పోయించిన గొరిల్లా.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..

వ్యక్తిపై దాడిచేస్తున్న గొరిల్లా

వ్యక్తిపై దాడిచేస్తున్న గొరిల్లా

Viral video: ఒక వ్యక్తి జూకు వెళ్లాడు. అక్కడ బోనులో గొరిల్లా ఉంది. కాసేపు దాన్ని సరదాగా ఆట పట్టిద్దామనుకున్నాడు. బోను దగ్గరకు వెళ్లాడు. వెకిలి చేష్టలు వేశాడు.

జంతువులతో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అవి ఎప్పుడు ఏవిధంగా ప్రవర్తిస్తాయో అసలు అర్థం కాదు. సాధారణంగా మనం జూలకు, పార్కులకు వెళ్తుంటాం. అక్కడ చాలా జంతువులు ఉంటాయి.  జూ సిబ్బంది జంతువులను దూరం నుంచే చూడాలంటూ బోర్డులు పెడతారు. కానీ కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. జంతువులను రాళ్లతో కొట్టడం, వాటి దగ్గరకు వెళ్లి ఫోటోలకు ట్రై చేయడం, వాటిని గెలకడం వంటివి చేస్తుంటారు. దీంతో అవి కోపంగా ప్రవర్తిస్తాయి. ఎదుటివారిపైన దాడులకు కూడా దిగుతుంటాయి. ఇది వరకే బోనులో ఉన్న సింహాం, పులులు, ఇతర జంతువులు కొన్ని సార్లు దాడులు చేసిన సంఘటనలు గతంలో జరిగాయి. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఇండోనేషియాలోని (Indonesia)  ఒక జూలో భయానక సంఘటన జరిగింది. ఒక వ్యక్తి జూను సందర్శించడానికి వచ్చాడు. అక్కడ బోనులో ఒక గొరిల్లా ఉంది. ఇంతలో మనోడు దాని దగ్గరకు వెళ్లాడు. దాని బోనును సమీపించి పిచ్చి చేష్టలు చేశాడు. దీంతో గొరిల్లా అతనిపై దాడి చేసింది. అది అతని షర్ట్ ను పట్టుకుంది. దాన్ని విడిపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. అతనికి సాధ్యపడలేదు. అప్పటికే అతని వెన్నులో వణుకు మొదలైంది.


ఆ తర్వాత.. అతగాడి కాలును బలంగా పట్టుకుంది. మరోక వ్యక్తికూడా అతడిని బయటకు లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. గొరిల్లాను కొడుతున్న, దానిపైన దాడిచేస్తున్నఅది మాత్రం ఆవ్యక్తి కాళ్లను వదలడంలేదు. దీంతో అక్కడి వారంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రస్తుతం ఈ భయానక వీడియో నెట్టింట (Social media)  వైరల్ గా (Viral video) మారింది.

ఇదిలా ఉండగా  ఒక పిల్లి , కోడి పుంజు మీద సవారీ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.



సాధారణంగా కొన్ని జీవుల మధ్య జాతీ వైరాలుంటాయి. పొరపాటున కూడా ఒకదానికి మరోకటి ఎదురుపడవు. ఒక వేళ పడితే, అందులో ఏదో జీవికి మూడినట్లే.  అయితే, చిన్న ప్పటి నుంచి ఒక చోట పెరగటం వలన అవి తమ మధ్య ఉన్న వైశామ్యాలు మరిచిపోయి ఎంతో స్నేహంగా ఉంటాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ (viral video) అవుతుంటాయి. మెయిన్ గా కుక్కలు, పిల్లులు, గున్నఏనుగుల వీడియోలు ట్రెండింగ్ లో (Trending video) ఉంటాయి. కుక్కలు, పిల్లులతో సరదాగా ఆడుకోవడం, పిల్లుల చేష్టలు, గున్న ఏనుగుల ఫన్నీ సంఘటనలు నెట్టింట వైరల్ గా మారిన విషయం తెలిసిందే. నెటిజన్లు కూడా ఈ వీడియోలను చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఈ కోవకు చెందిన ఒక ఫన్నీ వీడియో ప్రస్తుతం నెట్టింట (Social media) వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. ప్రస్తుతం ఈ వీడియోలో ఒక పుంజు ఉంది. ఒక పిల్లి, పుంజు దగ్గరకు వెళ్లింది. పిల్లి, మెల్లగా కోడి వీపుపైన ఎక్కి కూర్చుంది. అవి రెండు మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటున్నాయి. కోడి పుంజు కూడా ఏమాత్రం కదిలించకుండా పిల్లిని భుజంపైన ఎక్కించుకుంది. పిల్లి కూడా హయిగా సవారీ చేస్తున్నట్లు మంచిగా ఎక్కి కూర్చుంది. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Indonesia, Trending video, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు