Viral Video: ట్రైన్ వస్తున్న క్షణాల ముందు పట్టాలపై పడ్డ వికలాంగుడు.. హీరోలా వచ్చి కాపాడాడు!

వికలాంగుడ్ని కాపాడి హీరోగా మారిన వ్యక్తి

ప్రాణాలకు తెగించి కొంతమంది సాహసాలు చేస్తారు. అలాగే ఓ వ్యక్తి రైల్వే ట్రాక్ పై పడిపోయిన ఓ వికలాంగుడ్ని.. ట్రైన్ వచ్చే కొన్ని క్షణాలకు ముందే కాపాడిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

  • Share this:
    కొంతమంది వ్యక్తులు చేసిన సహసాలు సెల్యూట్ అనేలా చేస్తాయి. వారు చేసిన సహాసాలు ప్రపంచంలో హీరోల్లా మారుస్తాయి. ఆ మధ్య మన దేశంలో ఓ మహిళ, చిన్నారి రైల్వేస్టేషన్ లో ఫ్లాట్ ఫామ్ మీద నడుచుకుంటూ వెళ్తుండగా.. చిన్నారి ట్రాక్ మీద పడిపోతే పోలీస్ క్షణాల్లో ట్రాక్ మీదకి దూకి చిన్నారిని కాపాడాడు. ఆ వీడియో అప్పుడు వైరల్ గా మారాడంతో ఈ ఘటనలో అతన్ని హీరోలా కీర్తించి నజరానాలు కూడా ఇచ్చారు. అచ్చంగా ఇప్పుడు అమెరికాలో అలాంటి ఘటనే జరగగా ఇప్పుడు అది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. న్యూయార్క్ లోని యూనియన్ స్క్వేర్ రైల్వే స్టేషన్లో ఓ వికలాంగుడు ఫ్లాట్ ఫామ్ మీదగా వెళ్తుండగా ప్రమాదవశాత్తు వీల్ చైర్ తో సహా ట్రాక్ మీద పడిపోయాడు. ఫ్లాట్ ఫామ్ మీద చాలామంది ప్రయాణికులు ఉండగా అందులో ఒక వ్యక్తి ట్రాక్ మీదకి దిగి ముందుగా వీల్ చైర్ ను పైకి ఎక్కించి వికలాంగుడిని కూడా పైకి ఎక్కించాడు. అతను ట్రాక్ మీదకి దిగిన తరువాత మిగతా ప్రయాణికులు కూడా ముందుకొచ్చి అతనికి సాయం అందించారు.

    ఫ్లాట్ ఫామ్ మీద ఉన్న వాళ్ళు సురక్షితంగా పైకి వచ్చిన పది సెకన్లకు రైలు ట్రాక్ మీదకి వచ్చింది. రైలు వస్తుందని ఒకపక్క అనౌన్స్ మెంట్ వినిపిస్తుండడంతో ఎవరూ ట్రాక్ మీదకి దిగేందుకు సాహసించలేదు. కానీ ఓ వ్యక్తి ట్రాక్ మీదకి దిగడంతో మిగతా వాళ్ళు కూడా ముందుకొచ్చి సాయం చేశారు. అయితే..ముందుగా ట్రాక్ మీదకి దిగిన అతని ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు. http://



    కేవలం పది సెకెన్ల వ్యవధిలో పెను ప్రమాదం తప్సింది.. ట్రైన్ వస్తోంది అని తెలిసినప్పుడు ట్రాక్ పైకి వెళ్లడం అంటే నిజంగా సాహసమే.. క్షణం ఆలస్యమైనా ప్రాణాలపైకి తెచ్చుకోవాల్సి వస్తుంది. కానీ ఆ వ్యక్తి మాత్రం అవేవీ ఆలోచించుకుండా వికలాంగుడ్ని రక్షించాలనే లక్ష్యంగా సాహసం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు...
    Published by:Nagesh Paina
    First published: