VIRAL VIDEO ONE GIRL ATTACKED ON SHOPKEEPER BECAUSE HE BEATEN HER FATHER IN MADHYA PRADESH NGS
Girl Beat Shopkeeper: నాన్నకు ప్రేమతో.. తండ్రిని కొట్టాడని ఓ కూతురు ఏం చేసిందో చూడండి.. వైరల్ వీడియో
నాన్నకు ప్రేమతో
Girl Beat Shopkeeper: ఏ కూతురుకి అయినా.. తండ్రి అంటే చెప్పలేనంత ప్రేమ. కొడుకు కన్నా.. కూతురే తండ్రిని ఎక్కువగా ఇష్టపడుతుంది. తండ్రిపై ప్రేమను ఒక్కొక్కరు ఒక్కో రూపంలో చూపిస్తారు.. ఓ అమ్మాయి అయితే.. తన తండ్రిని ఓ షాప్ కీపర్ కొట్టాడని ఆగ్రహంతో ఊగిపోయింది.. అపరకాళి అవతారం ఎత్తి ఏం చేసిందో చూడండి.
Girl Beat Up Shopkeeper: సాధారణంగా కొడుకు కంటే కూతురుకే తండ్రిపై ఎక్కువ ప్రేమ, ఇష్టం ఉంటుంది అంటారు. చాలా సందర్భాల్లో అమ్మాయిలు తమ ప్రేమను తండ్రి (Father)పై చూపిస్తుంటారు. అయితే చాలా రకాలుగా తండ్రిపై కూతుళ్లు తమ ప్రేమ చూపిస్తుంటారు.. కానీ ఇక్కడ ఒక అమ్మాయి (Girl) తన ఉగ్ర రూపం చూపించింది.. ఎందుకో తెలుసా..? ఓ షాప్ కీపర్.. తన తండ్రిని కొట్టాడని ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. అపరకాళిలా అవతారం ఎత్తింది. తన తండ్రిని కొట్టడాన్ని ఆమె ఏ మాత్రం తట్టుకోలేకపోయింది. వెంటనే అక్కడ చేతికి దొరికన కర్రను తీసుకొని ఆవేశంగా వెళ్లింది. ఎవరైతే తన తండ్రిని కొట్టాడో అతడి దగ్గరకే నేరుగా వెళ్లింది. తన తండ్రి పై చేయి చేసుకోవడానికి ఎంత ధైర్యం అంటూ నిలదీసింది. అక్కడితోనే ఆగకుండా.. ఆ వ్యక్తిని కర్రతో చికతబాదింది. అందరూ చూస్తుండగానే అతడికి బుద్ధి చెప్పింది. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral video) గా మారింది.
శివపురిలోని దినారా పట్టణంలో ఓ టీ దుకాణదారుడు.. ఓ వృద్ధపై దాడి చేశాడు. ఆ విషయం కూతురుకి తెలిసింది. దీంతో తన తండ్రిపై చేయి వేయడం జీర్ణించుకోలేకపోయింది. తండ్రిని కొట్టాడు అన్న విషయాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. వద్దు వద్దు అని బతిమాలుతున్నా వదలకుండా దుకాణదారుడిని కర్రతో కొట్టింది. బాధితుడు తేజ్ సింగ్ పరిహార్ దీనిపై స్పందించాడు. తాను హైవే సమీపంలోని భురా టీ షాప్ లో టీ తాగానని, ఆ తర్వాత 5 రూపాయలు చెల్లించినా.. డబ్బులు ఇవ్వలేదని టీ కొట్టు యజమాని తనను కొట్టాడని వాపోయాడు.
ఆ తర్వాత అతడు ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లాక విషయం తెలుసుకున్న కూతురు కోపంతో ఊగిపోయింది. తన తండ్రినే కొడతావా? అంటూ.. కర్ర తీసుకుని టీ కొట్టుకి వెళ్లి అక్కడ టీ కొట్టు యజమానిని కొట్టిందని సింగ్ తెలిపారు. ఈ గొడవను చూసిన చుట్టుపక్కల వాళ్లు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఓ అమ్మాయి చేతిలో కర్రతో వచ్చి టీ కొట్టు యజమానిని చితకబాదడం విస్మయానికి గురి చేసింది.
Madhya Pradesh: A shopkeeper beat up an elderly person for Rs 5 of tea. After which the daughter of the victim reached the shop and beat up the shopkeeper in Dinara town, Shivpuri. The video of the incident is going viral on social media. pic.twitter.com/BN359YiU15
ఆ తర్వాత కారణం తెలుసుకున్నారు. ఆమెకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపేశారు. తండ్రి బాధను చూడలేక ఆ కూతురు చేసిన పనికి ప్రశంసలు అందుతున్నాయి. శభాష్, మంచి పని చేశావ్ అని కొందరు నెటిజన్లు ఆమెను సమర్థించారు. మరి కొందరు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.