Video: గేదెను ఎత్తాలనుకున్నాడు.. అది ఏం చేసిందో తెలుసా?

గేదెను ఎత్తాలనుకున్నాడు (image credit - instagram)

Viral Video: కొందరు రొటీన్‌కి భిన్నంగా ఆలోచిస్తారు. అతను అదే చేశాడు. బియ్యం బస్తా ఎత్తినట్టు... గేదెను ఎత్తాలి అనుకున్నాడు. ఆ తర్వాత ఏమైందో వీడియోలో చూడండి.

  • Share this:
    Viral Video: మీరు బాహుబలి సినిమా చూశారుగా... అందులో రెబల్ స్టార్ ప్రభాస్... పరమేశ్వరుడి శివలింగాన్ని ఎత్తే సీన్ ఎలా ఉంటుంది... ఓ రేంజ్‌లో ఉంటుంది కదా... ఆ సీన్ ఓ కుర్రాడికి తెగ నచ్చింది. మరి అందరూ ప్రభాస్‌లు కాలేరు కదా అలా చెయ్యడానికి. ఆ కుర్రాడు తనకు తాను చిన్నసైజు బాహుబలి (Bahubali)లా ఫీల్ అయ్యాడు. ఏ బియ్యం బస్తాలో ఎత్తితే వరైటీ ఏముంటుంది... డైరెక్టుగా గేదెను ఎత్తేస్తే సరి అనుకున్నాడు. అందుకోసం కుస్తీలు పట్టాడు. తన కండలు చూపించాడు. మానసికంగా ఫుల్‌గా ప్రిపేర్ అయ్యాడు. ఆ తర్వాత గేదెను ఎత్తడం మొదలుపెట్టాడు (Boy trying to lift buffalo on shoulder).. కట్ చేస్తే...

    ఈ రోజుల్లో చాలా మంది కొత్తగా ఏదైనా చెయ్యాలని రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. మొన్న ముంబైలో ఎగ్ ఆమ్లెట్‌లో ఫాంటా (Fanta Omelette) వేశారు. అది ఎవరికీ నచ్చలేదు. నెటిజన్లు రివర్స్ థంబ్ ఇచ్చారు. ఇప్పుడీ కుర్రాడు కూడా... గేదెను ఎత్తేద్దామని... దాని కింది నుంచి చెయ్యి పెట్టి... ఎంత ట్రై చేసినా... అది ఇంచు కూడా పైకి లేవలేదు. అతను మహా అయితే... ఓ పది డిగ్రీలు గేదెను అలా తిప్పగలిగాడు తప్పితే... ఎత్తలేకపోయాడు. నయం అది ఏ కాలితోనో తన్నకుండా కుదురుగా ఉంది. అది అలా తన్ని ఉంటే... ఆస్పత్రి పాలయ్యేవాడేమో.

    ఆ వీడియో ఇక్కడ చూడండి.








    View this post on Instagram






    A post shared by Kaint_soch (@kaint_soch4)





    kaint_soch4 అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ వీడియోను అప్‌లోడ్ చేశారు. దీన్ని చూసినప్పుడు మనం అతనికి ఏ సాయమూ చెయ్యలేం... మహా అయితే సరదాగా నవ్వగలం.

    ఇది కూడా చదవండి: Shocking Video: ఓమైగాడ్.. ఆ బస్సుకి ఏమైంది? ఆ క్షణంలో...

    అసలు గేదెను ఎత్తాలి అనుకోవడమే రాంగ్. ఎందుకంటే... అదేమీ బియ్యం మూట కాదు ఓ పద్ధతిలో ఉండటానికి. గేదెకు కాళ్లు, పొట్ట, తల, తోక ఇలా చాలా భాగాలుంటాయి. పైగా అది కదలగలదు. అందువల్ల దాన్ని ఎత్తడం వీలయ్యే పని కాదు. పోనీ అతనేమైనా ప్రభాస్‌లా అదిరిపోయే కటౌటా అంటే... మరీ అంత లేదు కదా. అందువల్లే అతనికి కుదరలేదని నెటిజన్లు అంటున్నారు. కానీ... ఇలాంటి వీడియో చేసినందుకు మెచ్చుకుంటున్నారు. తమను కాసేపు సరదాగా నవ్వించగలిగాడు అని అంటున్నారు. కొందరు మాత్రం ఇలాంటి ప్రయోగాలు చెయ్యొద్దు బ్రో అని సలహా ఇస్తున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: