ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహణ్ రెడ్డి ఫొటోకు కొందరు వంగి వంగి దండాలు పెడుతున్న వీడియో బయటకు వచ్చింది. ఇది విజయనగరం జిల్లాలో జరిగినట్టు తెలుస్తోంది. జిల్లాలోని వైసీపీ నేత గ్రామ వాలంటీర్లతో అలా సీఎం ఫొటోకు వంగి వంగి దండాలు పెట్టించారని చెబుతున్నారు. ఈ విషయాన్ని టీడీపీ నేత కిడారి శ్రవణ్ కుమార్ తన ఫేస్ బుక్లో పోస్ట్ చేశారు. కరోనా వైరస్ నియంత్రణలో ముందుండి పోరాడుతున్న గ్రామ వాలంటీర్లకు కూడా బీమా కల్పించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో సీఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతగా గ్రామ వాలంటీర్లు ఇలా దండాలు పెట్టారు. అయితే, ముఖ్యమంత్రి చేసిన పని అభినందనీయమే అయినా, స్థానికంగా ఓ వైసీపీ నేత బలవంతంగా వారి చేత ఇలా వంగి వంగి దండాలు పెట్టించారని, జై జగన్ నినాదాలు చేయించారని ఆరోపిస్తున్నారు. ‘ఇదెక్కడి రాజ్యం? ప్రజలంటే అంత చిన్నచూపా నాయకులకు, ఇది సందర్భమా?’ అంటూ శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.