Home /News /trending /

VIRAL VIDEO OF ORANGUTAN SMOKING IN VIETNAM ZOO SPARKS TWITTER OUTRAGE PAH

OMG: వామ్మో.. జూలో దమ్ముకొడుతున్నచింపాంజీ.. వీడియో వైరల్..

సిగరేట్ తాగుతున్న చింపాంజీ

సిగరేట్ తాగుతున్న చింపాంజీ

Vietnam Zoo: జూలో అంతరించి పోతున్న కోతిని ఎన్ క్లోజర్ లో ఉంచారు. అయితే, అది తన చేతిలో సిగరేట్ పట్టుకుంది. ఆ తర్వాత.. అచ్చం మనిషిలాగే ప్రవర్తించింది.

మనిషి కోతుల నుంచే మార్పుచెందుతూ వచ్చాడు. కోతులు చాలా వరకు మనిషిని పోలిన చేష్టలను చేస్తుంటాయి. మన ఇంట్లో అప్పుడప్పుడు కోతు వస్తుంటాయి. అవి డబ్బాలను పట్టుకుని పారిపోతుంటాయి. అవి ఇళ్ల మీద కూర్చుని డబ్బా మూతలను తీసి దానిలో ఉన్నదాన్ని తింటాయి. అదే విధంగా, కొన్ని ఫలాలను అచ్చం మనిషిలాగే తింటాయి. కొన్నిసార్లు వాటి చేష్టలు నవ్వు తెప్పిస్తుంటాయి. కోతులు గుంపులుగా తిరుగుతుంటాయి. మనుషులపై దాడులు చేస్తుంటాయి. చేతిలో తినే వస్తవులు ఉంటే లాక్కుని పారిపోతాయి.

ఇప్పటికే కోతులకు సంబందించిన అనేక వీడియోలు (social media)  నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ మధ్య కాలంలో .. చింపాంజీల వీడియోలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. చింపాంజి సైకిల్ నడిపించడం, ఎన్ క్లోజర్ లో చింపాంజిని గెలికిన వ్యక్తిపై దాడిచేయడం వంటి వీడియోలు (viral video)  వార్తలలో నిలిచాయి. మరొక చింపాంజి వింత ప్రవర్తనతో మరోసారి వార్తలలో నిలిచింది.



పూర్తి వివరాలు.. సౌత్ ఆసియన్ దేశంలోని వియత్నంలో ఈ ఘటన జరిగింది. హో చిమిన్ సిటీలోని సైగాన్ జూ ఉంది. దానిలో ఒక ఒరంగుటాన్ ను ప్రత్యేకంగా కాపాడుతున్నారు. అయితే, అది ఒక సిగరేట్ తీసుకుంది. (Orangutan Smoking in Vietnam Zoo) దాని చేతిలో పట్టుకుని మనిషి మాదిరిగా పొగను తాగింది. అది అచ్చం మనిషి మాదిరిగా దమ్ముకొడుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై అధికారులు సీరియస్ అయ్యారు. అయితే, తరచుగా కొన్ని జంతువు మనిషిని కాపీకొడతాయి.



దీనిలో భాగంగా ఎవరైన .. ఒరంగుటాన్ ను చూడటానికి వచ్చిన వారు. దాని దగ్గరలో సిగరేట్ విసిరి ఉంటారు. ఆతర్వాత.. అది వాళ్ల చేస్తున్న పనిని అనుసరించి ఉండోచ్చన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైన.. ఒక అంతరించిపోతున్న జీవజాతి.. ఈ విధంగా పట్టించుకొకుండా ఉండటం పట్ల అధికారులు జూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నెటిజన్లు కూడా తీవ్రంగా కామెంట్ లు పెడుతున్నారు. వెంటనే జూ సిబ్బందిపై చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Monkeys, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు