Video : బ్రిడ్జి కిందకు వెళ్లగానే మాయమవుతున్న కార్లు, బైకులు..?

వైరల్ వీడియోల్లో ఇది మరో రకం. ఇందులోని బ్రిడ్జి కిందకు వెళ్లగానే బైకులూ, కార్లూ కనిపించకుండా పోతుంటే... నెటిజన్లు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. కారణమేంటో రకరకాలుగా వివరిస్తున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: August 9, 2019, 10:23 AM IST
Video : బ్రిడ్జి కిందకు వెళ్లగానే మాయమవుతున్న కార్లు, బైకులు..?
వీడియోలో దృశ్యం (Image : Twitter - Daniel)
Krishna Kumar N | news18-telugu
Updated: August 9, 2019, 10:23 AM IST
మంత్రాలూ, మాయలకు ఈ రోజుల్లో చోటు లేదు. ఏ విషయమైనా సైంటిఫిక్ కారణం తెలియాల్సిందే. మరి ఈ వీడియో సంగతేంటి? ఇందులో ఎందుకు అలా అవుతోంది? ఆ మిస్టరీ ఏంటి? ట్విట్టర్ యూజర్ డాన్నీ డచ్... ఈ వీడియోని పోస్ట్ చేశాడు. ఇందులో కార్లు, బైకులూ... రోడ్డుపై నుంచీ ఓ బ్రిడ్జి వైపు వెళ్తూ కనిపించకుండా పోతున్నాయి. బ్రిడ్జి కింద పెద్ద ప్రవాహం ఉన్నట్లు కనిపిస్తోంది. అ వాహనాలు బ్రిడ్జి కిందకు పడిపోవట్లేదు. మరి అవి ఏమైపోతున్నాయి. ఎటు వెళ్తున్నాయి? అసలిది ఎలా సాధ్యం... ఇందులో ఏదో ట్రిక్ ఉంది అని నెటిజన్లు ఆలోచనల్లో పడిపోతున్నారు. వీడియోని ఒకటికి రెండు సార్లు చూసి... తమదైన శైలిలో విశ్లేషణలు చేస్తున్నారు.











ఇలా కొంతసేపు నెటిజన్లను కన్‌ఫ్యూజ్ అయ్యాక ఓ యూజర్... అసలు కారణం చెప్పాడు. నిజానికి అది బ్రిడ్జే కాదనీ... అది ఓ బిల్డింగ్ పై భాగం అనీ చెప్పాడు. బిల్డింగ్ పైన కార్ పార్కింగ్ ఏరియా ఉందనీ, అందులో నీరు చేరడంతో... అది బ్రిడ్జిలా కనిపిస్తోందని చెప్పాడు. అక్కడి నుంచీ వీడియో తియ్యడం వల్ల... వాహనాలు మాయమవుతున్నట్లు కనిపిస్తోందని తెలిపాడు. మొత్తానికి ఈ వీడియో వైరల్ అయ్యింది.



First published: August 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...