కప్ప కడుపులో లైట్... వెలిగి ఆరుతోంది... వైరల్ వీడియో

Frog Light Viral Video: మన ప్రపంచం అద్భుతమైనది. ప్రకృతిలో ఎన్నో ఆశ్చర్యకర ఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఒకటి ఇప్పుడు మనం చూద్దాం.

news18-telugu
Updated: September 14, 2020, 7:29 AM IST
కప్ప కడుపులో లైట్... వెలిగి ఆరుతోంది... వైరల్ వీడియో
కప్ప కడుపులో లైట్... వెలిగి ఆరుతోంది... వైరల్ వీడియో (credit - twitter)
  • Share this:
Frog Light Viral Video: సోషల్ మీడియాలో రకరకాల వైరల్ వీడియోలను మనం చూస్తున్నాం. కరోనా వచ్చాక... జంతువులు, ప్రాణుల వీడియోలు బాగా పెరిగాయి. కొన్నైతే... సూపర్ వైరల్ అవుతున్నాయి. అలాంటి ఓ వీడియో ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇందులో ఓ కప్ప గోడపై ఉంది. దాని పొట్టలో లైట్ వెలిగి ఆరుతోంది. అదేంటి... కంప్యూటర్ గ్రాఫిక్కా, నిజమా అని నెటిజన్లు అనుకుంటూ... అసలు విషయం తెలిశాక... అవునా అంటున్నారు. అసలు విషయమేంటంటే... ఇది పగటి వేళ తీసిన వీడియో కాదు. కాస్త చీకటి పడుతున్నప్పడు తీసింది. అందువల్ల కప్ప కడుపులో లైట్ కాంతి మనకు కనిపిస్తోంది. ముందు వీడియో చూడండి... కారణం కింద రాశాను.


మీరు అనుకున్నదే రైట్. ఆ కప్ప... మిణుగురు పురుగును మింగేసింది. పొట్టలోని ఆ పురుగు ఇంకా చనిపోలేదు. అందువల్ల పురుగు వెలిగి, ఆరుతుంటే... కప్ప వెలుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియోని సెప్టెంబర్ 11న ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇప్పటికే ఈ వీడియోని 91వేల మందికి పైగా చూశారు. 5వేల మందికి పైగా లైక్ చేశారు. ఐతే... ఇది ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ఈ వీడియో చూసిన వాళ్లు... పకృతిని గమనించడం వల్ల ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూడొచ్చని అంటున్నారు.
Published by: Krishna Kumar N
First published: September 14, 2020, 7:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading