Home /News /trending /

VIRAL VIDEO OF BIKE RIDER WHO RIDES HIS BIKE ON THE DANGEROUS HILL STATION HERE IS THE DETAILS AK

Viral Video: ఏం తమ్ముడూ.. జీవితం మీద ఆశ లేదా ? ఇక్కడ బైక్ నడపడం ఏంటి.. వీడియో వైరల్

బైక్ రైడర్

బైక్ రైడర్

Viral Video: వీడియోలో కనిపించే ఒక రహదారి పూర్తిగా గుంటకు ఆనుకుని ఉంది. బైక్ రైడర్ కళ్లు కొంచెం అటుఇటుగా లేదా బ్యాలెన్స్ చెదిరిపోతే నేరుగా మృత్యువుకు చేరువవుతుంది

    సాహసం చేయడానికి కూడా ఓ హద్దు ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణం పోతుందనే విధంగా ఉండే సాహసాలు చేసేందుకు చాలామంది వెనకాడుతుంటారు. కానీ కొందరు మాత్రం ఇలాంటి డేర్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. తాజాగా సోషల్ మీడియాలో(Social Media) ట్రెండ్ అవుతున్న ఓ వీడియోలోని వ్యక్తి అలాంటి కోవలోకే వస్తారని చెప్పొచ్చు. ఈ వీడియో చూసిన చాలామంది కొద్దిసేపు తమను తామే నమ్మలేకపోతున్నారు. ఇది నిజంగా నిజమైన వీడియోనేనా అని ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం చాలా ప్రమాదకరమైన బైకింగ్(Bike) వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇరుకైన ప్రదేశాలలో బైక్‌లు నడుపుతున్న వ్యక్తులను మీరు తప్పక చూసి ఉంటారు, కానీ ఈ వ్యక్తి ప్రమాదకరమైన మార్గం గుండా వెళుతున్న తీరు చూస్తే మాత్రం మీకు కూడా షాక్ తగులుతుంది.

    కొంతసేపు మీ కళ్లను మీరే నమ్మరు కూడా. వీడియో స్టంట్ చూసిన తర్వాత మాత్రమే మీ అరుపు బయటకు వస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో కొన్ని సెకన్ల నిడివి మాత్రమే. కానీ అందులో బైక్ నడుపుతున్న వ్యక్తిని చూస్తే మాత్రం కాసేపు నోట మాటరాదు. బైకర్ ప్రయాణిస్తున్న పర్వత రహదారులు అంత సులభం కాదు. కాస్త అటెన్షన్‌ పోతే పెను ప్రమాదం జరగవచ్చు. వైరల్ అవుతున్న వీడియో కొన్ని సెకన్ల నిడివి మాత్రమే, కానీ దాన్ని చిత్రీకరించిన తీరు చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది.








    View this post on Instagram






    A post shared by memes | comedy (@ghantaa)






    వీడియోలో కనిపించే ఒక రహదారి పూర్తిగా గుంటకు ఆనుకుని ఉంది. బైక్ రైడర్ కళ్లు కొంచెం అటుఇటుగా లేదా బ్యాలెన్స్ చెదిరిపోతే నేరుగా మృత్యువుకు చేరువవుతుంది. బైకింగ్ చేస్తున్నప్పుడు, వెనుక ఉన్న వ్యక్తి దిగి, అక్కడ నుండి నెమ్మదిగా నడవడం ప్రారంభించాడు. చాలా బలమైన గుండె మరియు కాలేయం ఉన్న వ్యక్తులు మాత్రమే ఇటువంటి మార్గాల ప్రయాణాన్ని చూడగలరు.

    Married Women: భర్త గురించి పెళ్లయిన మహిళలు గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్‌ విషయాలు ఇవే..

    Trending: పొలం దున్నతుంటే బయటపడ్డ రూ. 500, రూ. 1000 నోట్ల కట్టలు.. కానీ ఏం లాభం..

    వైరల్ అవుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. జూన్ 23న అప్‌లోడ్ చేసిన వీడియోను ఇప్పటి వరకు 2 లక్షల 20 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. వీడియో చూసిన తర్వాత, ప్రజలు తమ అనేక స్పందనలను నమోదు చేస్తున్నారు. కొంతమంది వినియోగదారులు ఈ సాహసం కూడా మంచిది కాదని అన్నారు. కొందరు ఈ వీడియో చూసి అతడు మరణం అంచున వరకు వెళ్లొచ్చాడని కామెంట్ చేస్తున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు