HOME » NEWS » trending » VIRAL VIDEO OF A DOG SHAKES HANDS AND GIVING BLESSINGS TO DEVOTEES AT OUTSIDE TEMPLE IN MAHARASHTRA HSN

Viral Video: ఓరి నాయనో.. ఈ శునకం విన్యాసాలు మామూలుగా లేవుగా.. ఏకంగా ఆశీర్వాదాలిచ్చేస్తోంది..!

ఆ గుడి ముందు ఉన్న ఓ శునకరాజం చేసిన చేష్టలకు సోషల్ మీడియా ఫిదా అయింది. అచ్చం తనను తాను ఓ దేవుడిలా ఊహించుకున్న ఆ శునకరాజం ప్రవర్తన అందరి మోముల్లోనూ నవ్వును తెప్పిస్తోంది. ఫేస్ బుక్ లో ఓ వ్యక్తి పోస్ట్ చేసిన రెండు వీడియోలు, సోషల్ మీడియాలో యమా వైరల్ అవుతున్నాయి. ఓ శునకం వీడియోకు వేల్లలో కామెంట్లు ఉంటాయని ఎవరైనా ఊహించగలరా.?

news18-telugu
Updated: January 12, 2021, 4:50 PM IST
Viral Video: ఓరి నాయనో.. ఈ శునకం విన్యాసాలు మామూలుగా లేవుగా.. ఏకంగా ఆశీర్వాదాలిచ్చేస్తోంది..!
గుడి ముందు భక్తులకు ఆశీర్వాదాలు ఇస్తున్న శునకం
  • Share this:
అదొక ప్రముఖ దేవాలయం. ఆ గుడికి రోజూ వందల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. దర్శనం పూర్తి చేసుకుని వెళ్తుంటారు. సాధారణంగా అయితే ఆ గుడి గురించి కానీ, అక్కడి విషయాల గురించి కానీ వార్తల్లో వచ్చేది కాదు. కానీ ఆదివారం జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అలా అని ఆ గుడిలో ఏదో మహత్తో, అద్భుతమో జరిగిందనుకునేరు. కాదు కాదు. ఆ గుడి ముందు ఉన్న ఓ శునకరాజం చేసిన చేష్టలకు సోషల్ మీడియా ఫిదా అయింది. అచ్చం తనను తాను ఓ దేవుడిలా ఊహించుకున్న ఆ శునకరాజం ప్రవర్తన అందరి మోముల్లోనూ నవ్వును తెప్పిస్తోంది. ఫేస్ బుక్ లో ఓ వ్యక్తి పోస్ట్ చేసిన రెండు వీడియోలు, సోషల్ మీడియాలో యమా వైరల్ అవుతున్నాయి. ఓ శునకం వీడియోకు వేల్లలో కామెంట్లు ఉంటాయని ఎవరైనా ఊహించగలరా.? దాదాపు 25వేలకు పైగా షేర్లు వస్తాయంటే నమ్మగలరా.? మరి ఆ శునకం చేసిన చేష్టలు అలాంటివి.



మహారాష్ట్రలోని ఓ గుడి మెట్ల వద్ద ఓ అరుగుపై ఓ శునకం ఉంది. దర్శనం పూర్తి చేసుకుని వచ్చే భక్తులను ఆ శునకం దీవిస్తోంది. అది కూడా అడిగిమరీ దీవిస్తోంది. ఓ బాబాలా ఆ శునకం అరుగుపై కూర్చుని, భక్తులకు ఆశీర్వాదాలు అందిస్తోంది. ఓ మహిళ వస్తూ వస్తూ, ఆ శునకాన్ని షేక్ హ్యాండ్ ఇవ్వమని కోరింది. అంతే ఆ శునకం వెంటనే తన చేతిని ఆమె చేతిలో వేసింది. ఆ తర్వాత ఆమె వెనుక వచ్చిన మరో వ్యక్తిని పిలిచి మరీ షేక్ హ్యాండ్ ఇచ్చింది. అంతే కాదండోయ్, ఆ శునకం చేసిన చేష్టలు ఇంకా ఉన్నాయి.



ఓ వ్యక్తి ఎంతో నిదానంగా ఆ శునకం వద్దకు వచ్చి ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా మోకాళ్లపై వంగాడు. మామూలుగా అయితే ఆ బెదిరిపోయి పారిపోవాల్సింది. కానీ ఇది అలాంటిలాంటి శునకం కాదు కదా. తనను తాను పూర్వ జన్మలో దేవుడిలా భావిస్తోందో, లేక శాపవశాత్తు ఇలా పుట్టానని ఫీలవుతోందో ఏమో కానీ వెంటనే ఆ శునకం తన కాలితో అతడి తలపై వేసి దీవించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మొత్తానికి ఈ శునకానికి సంబంధించి ఓ రెండు వీడియోలను అరుణ్ లిమడియా అనే వ్యక్తి తన పేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేస్తే, ఊహించని రీతిలో స్పందన కనిపించింది. ఏకంగా 15వేల లైకులు, 25వేల షేర్లు, వెయ్యికి మించి కామెంట్స్ తో అతడి ఫేస్ బుక్ ఖాతా మోతమోగిపోతోంది. మరి ఆ శునకం చేసిన ఫన్నీ హావభావాలను మీరు కూడా ఓ లుక్కేయండి..
Published by: Hasaan Kandula
First published: January 12, 2021, 4:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading