Home /News /trending /

Viral Video: రొట్టెలు చేస్తున్న యువతి.. సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న వీడియో.. ఆ స్మైల్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

Viral Video: రొట్టెలు చేస్తున్న యువతి.. సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న వీడియో.. ఆ స్మైల్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

రొట్టెలు చేస్తున్న యువతి(Image-Instagram)

రొట్టెలు చేస్తున్న యువతి(Image-Instagram)

కట్టెల పొయి వద్ద రొట్టెలు చేస్తున్న యువతి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన సింప్లిసిటీతో ఆ యువతి నెటిజన్లను కట్టిపడేస్తోంది.

    సోషల్ మీడియా ద్వారా సామాన్యులు కూడా ఓవర్‌నైట్‌లో ఫుల్ ఫేమస్ అవుతున్నారు. వీడియోలు వైరల్‌గా మారడంతో సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. తాజాగా ఆ జాబితాలో మరో యువతి చేరింది. అద్భుతంగా రొట్టెలు చేస్తున్న ఓ యువతి.. తన ట్యాలెంట్‌తో పాటుగా, అందంతో జనాలను కట్టిపడేస్తుంది. తనదైన చిరునవ్వుతో జనాల చూపులను ఇట్టే ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఆ యువతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఆ వీడియోలో యువతి కట్టెల పొయ్యి ముందు కూర్చొని రొట్టెలు చేస్తుంది. ఆమె చాలా సులవుగా రొట్టెలు చేస్తున్నట్టు వీడియోలో కనిపించింది. అయితే తొలుత తనను వీడియో తీస్తున్న విషయం ఆమెకు తెలియదు. ఆ తర్వాత ఆ విషయాన్ని తెలుకుని చిన్నగా స్మైల్ ఇచ్చింది.

    ఆ వీడియోలో యువతి వెనకాల కుక్కలు ఉన్నాయి. పిల్లలు ఆడుకుంటూ కనిపించారు. అయితే ఆ వీడియో ఎక్కడ తీశారు?, ఆ యువతి ఎవరనే విషయాలు మాత్రం తెలియలేదు. ఇక, ఈ వీడియోను తొలుత ఇన్‌స్టాగ్రామ్‌లో @Ekiya5 అనే అకౌంట్ నుంచి షేర్ చేశారు. ఇక, @Ekiya5 ఇన్‌స్టా అకౌంట్‌లో పలువురు మహిళలు రోటీలు, ఇతర ఫుడ్ ఐటమ్స్ తయారు చేసే వీడియోలు ఉన్నాయి.













    View this post on Instagram






    A post shared by @ekiya5






    ఇక, ఈ వీడియోను తర్వాత మరో ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేశారు. ఆ వీడియోకు 2 మిలియన్స్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ యువతిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘సోషల్‌ మీడియా సెలబ్రిటీ.. ఆమె ముందు హీరోయిన్‌లు కూడా పనికిరారు’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరో నెటిజన్.. ‘అందం మేకప్‌లో ఉండదు.. అది స్వచ్ఛమైనది’అని కామెంట్ పెట్టారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Social Media, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు