Home /News /trending /

VIRAL VIDEO NOIDA MAN ATTEMPTS DANGEROUS BIKE STUNT ON MOVING BIKE TO ACT LIKE SHAKTIMAAN PAH

OMG: మరే.. పోయే కాలం వస్తే ఇంతే మరీ.. బైక్ మీద టీనేజర్ డేంజరస్ స్టంట్ లు

బైక్ మీద డెంజరస్ స్టంట్ లు

బైక్ మీద డెంజరస్ స్టంట్ లు

Uttar pradesh: టీనేజర్ బైక్ రైడ్ చేస్తున్నాడు. ఒక్కసారిగా సీటు మీద ఫ్లాట్ గా పడుకున్నాడు. ఆ తర్వాత రోడ్డుపై డెంజరస్ స్టంట్ లు చేస్తున్నాడు.

కొంత మంది తమను తాము హీరోలు అనుకుంటారు. బైక్ లు, కార్ల మీద రకరకాల స్టంట్ లు చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని సార్లు.. బొక్కా బొర్లా పడుతుంటారు. యూత్.. అమ్మాయిల ముందు తమ హీరోయిజం చూపించుకొవాలనుకుంటారు. దీని కోసం వింత వింత ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్ని సార్లు వర్కవుట్ అయిన.. చాలా సార్లు అనుకొని సంఘటనలు జరుగుతుంటాయి. ఇక కొంత మంది ఆకతాయిలు.. రోడ్లపై, హైవేలపై చేతులు వదిలేసి బైక్ డ్రైవ్ చేయడం, ఒంటి చేత్తో వాహనాన్ని కంట్రోల్ చేయడం, వింత వింత స్టంట్ లు వేస్తుంటారు. ఇప్పటికే బైక్ రైడింగ్ లకు చెందిన అనేక వీడియోలు నెట్టింట దర్శన మిస్తున్నాయి. ఈ కోవకు చెందిన మరోక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.





పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లోని (Uttar pradesh) నోయిడాలో ఒక టీనేజర్ రోడ్డు మీద రైడింగ్ చేస్తున్నాడు. అతను బైక్ మీద (Byke stunt) పడుకుని భయంకల్గించేలా స్టంట్ లు వేస్తున్నాడు. బైక్ వెళ్తుండగానే దానిపై పడుకుని, వింతగా ప్రవర్తిస్తున్నాడు. తనకు తాను.. శక్తిమాన్ (Shakti man) అనుకుంటున్నాడు. ఇక ఓవర్ నైట్ స్టార్ అయిపోదామనుకున్నాడో ఏమో కానీ.. మొత్తానికి డెంజరస్ గా డ్రైవింగ్ చేస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా  (Viral video) మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ఇదేం పోయే కాలం.. ఇలా చేస్తున్నాడు.. మరే కాళ్లు చేతులు బాగా ఉన్నాయి కదా.. పడితే తెలుస్తుందంటూ కామెంట్ లు పెడుతున్నారు.

ఇదిలా ఉండగా ఒక యువతి నెమలి గుడ్లను దొంగిలించింది.

ఒక యువతి దూరం నుంచి నెమలిపెట్టిన గుడ్లను చూసింది. వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చింది. పాపం... నెమలి గుడ్లపై కూర్చుని ఉంది. యువతి మాత్రం వేగంగా.. నెమలిని అమాంతం పైకెత్తి అల్లంత దూరంలో పడేస్తుంది. గుడ్లను దొంగిలించడానికి ప్రయత్నిస్తుంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన నెమలి.. ఎగిరి యువతిని కింద పడేస్తుంది. ఆమెపై దాడిచేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీన్నిచూసిన నెటిజన్ లు కర్మఫలం అనుభవించాల్సిందే.. ఇన్ స్టాంట్ ఖర్మ అంటే ఇదే నేమో, ఈ అమ్మాయిని లాగిపెట్టి కొట్టాలనుంది అంటూ కామెంట్ లు పెడుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Bike rides, Uttar pradesh

తదుపరి వార్తలు