సాధారణంగా కోతుల (Monkeys) చేష్టలు నవ్వులు తెప్పించే విధంగా ఉంటాయి. అడవులు, గుట్టలకు దగ్గరగా ఉండే గ్రామాలలో కోతులు ఎక్కువగా వస్తుంటాయి. అవి ఇంట్లోకి ప్రవేశించి తినే పదార్థాలను పట్టుకుని కణాల్లో మాయమై పోతంటాయి. గుడులలో కూడా కోతులు ఎక్కువగా ఉంటాయి. పొరపాటున ఏదైన పదార్థాలు చేతిలో పట్టుకుని వాటికి కన్పించామా.. ఇక అంతే సంగతులు. వెంటనే మీదపడి వాటిని లాక్కొని వెళ్లిపోతుంటాయి. కొన్ని సార్లు కోతులు ఫన్నీగా కూడా ప్రవర్తిస్తాయి.
కోతుల చేష్టలు నవ్వు తెప్పించే (funny behaviour) విధంగా ఉంటాయి. అవి ఎగురుతూ, ఒక చెట్టు మీద నుంచి మరోక చెట్టు మీదకు, ఒక ఇల్లు మీది నుంచి మరోక ఇల్లు మీదకు దూకుతుంటాయి. అవి మనుషుల మాదిరిగా పళ్లను తింటాయి. కొన్ని కోతులు ఇంట్లోని బట్టలను కూడా లాక్కొని పోతుంటాయి. అవి వాటిని చింపుకుంటూ ఆడుకుంటాయి. ఇలాంటి ఎన్నో వీడియోలు ఇప్పటికే వైరల్ (viral video) అయ్యాయి. తాజాగా, మరో ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు.. ఒక యువతి కోతుల దగ్గరకు వెళ్లింది. అక్కడ కింద కూర్చుని సరదగా వాటితో సెల్ఫీ వీడియో రికార్డు చేస్తుంది. ఆమె వెనుకాల కొన్ని కోతులు ఉన్నాయి. అయితే, ఆమె కూర్చుని ఏదో తినడానికి పెడుతుందేమో అని కోతులు అనుకున్నాయి. ఇంతలో ఒక కోతి ఆమె దగ్గరకు వచ్చింది. ఫోన్ లో కోతి (monkeys) తన ప్రతి బింబాన్ని వింతగా చూసింది. ఆమె ఒడిలో ఏదైన ఉందేమో అని చూసి... అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత.. మరోకోతి వచ్చింది. పాపం.. అది రోమాంటిక్ కోతి కాబోలు.. వస్తునే యువతికి షాక్ కు గురిచేసింది. మెల్లగా యువతి దగ్గరకు వెళ్లింది. ఆమె కింద కూర్చుని ఉంది. వెంటనే ఆమె డ్రెస్ ను పైకెత్తి చూసింది. దాని కింద ఏమైన దాచిందేమో అని చూసింది. యువతి వెంటనే తన డ్రెస్ ను సర్దుకుంది. కోతి నేనేం చేశా.. అన్నట్లు అమాయకంగా ఆమె వంక చూసింది. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో (Funny video) నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు కోతి భలే రోమాంటిక్, అమ్మాయికి భలే షాక్ ఇచ్చిందంటూ కామెంట్ లు పెడుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.