VIRAL VIDEO MOTHER ELEPHANT SAVES BABY ELEPHANT FROM DROWNING IN THE RIVER PAH
ఇది కదా తల్లి ప్రేమంటే.. బిడ్డ కోసం తన ప్రాణాలను రిస్క్ లో పెట్టిన ఏనుగు.. వీడియో వైరల్..
బిడ్డను కాపాడుతున్న ఏనుగు
Viral video: ఏనుగుల గుంపు అడవిలో నీటి ప్రవాహాన్ని దాటుతున్నాయి. వాటిలో ఒక ఏనుగు, దాని బిడ్డ కూడా ఉన్నాయి. అయితే, గున్న ఏనుగు నీటి ప్రవాహంలో దారితప్పింది.
అమ్మ చూపించే ప్రేమను, ఆప్యాయతను మాటల్లో చెప్పలేము. జీవం ఉన్న మనుషుల నుంచి నోరు లేని జీవాల వరకు ప్రతి ఒక్క అమ్మ.. తన బిడ్డ పట్ల ఎనలేని ప్రేమను కల్గి ఉంటుంది. అమ్మ తన బిడ్డను తొమ్మిది మాసాలు మోసి కష్టపడి పెంచుతుంది. బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. తన బిడ్డకు ఏమైన జరిగితే విలవిల్లాడిపోతుంది. తన పిల్లల కోసం ఏం చేయడానికికైన తల్లి సిద్ధంగా ఉంటుంది. ఇక నోరు లేని మూగ జీవాలు, క్రూర జంతువులు కూడా తమ బిడ్డల పట్ల అంతే ప్రేమను కల్గి ఉంటాయి.
పొరపాటున తమ బిడ్డల జోలికి ఎదైన వేరే జీవి వస్తే.. తమ ప్రాణాలకు తెగించి మరీ పొరాడతాయి. తమ బిడ్డకు ఎలాంటి ఆపద లేకుండా తల్లి ప్రతి నిముషం అప్రమత్తంగా ఉంటుంది. బిడ్డలపై తల్లి చూపించే ప్రేమకు సంబంధించిన ఎన్నో ఘటనలు, వీడియోలు అనేకం వార్తలలో నిలిచాయి. ఇప్పుడు తాజాగా, మరో ఘటన నెట్టింట వైరల్ గా మారింది.
Mother elephant saving calf from drowning is the best thing you watch today. Video was shot near Nagrakata in North Bengal. Via WA. pic.twitter.com/aHO07AiUA5
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) June 25, 2022
పూర్తి వివరాలు.. ఉత్తర బెంగాల్ లోని (West bengal) నగ్రకటలో అరుదైన ఘటన జరిగింది. ఒక ఏనుగుల గుంపు (Elephant) అడవిలో నీటి ప్రవాహాన్ని దాటి మరోవైపుకు వెళ్తున్నాయి. సుమారు.. 15 వరకు ఏనుగులు ఉన్నాయి. అయితే, వాటిలో ఒక తల్లి, గున్న ఏనుగులు ఉన్నాయి. ఇంతలో గున్న ఏనుగు నీటి ప్రవాహాంలో అదుపు తప్పింది. అది నీటి ప్రవాహానికి కొంత దూరం కొట్టుకుపోయింది. తల్లి ఏనుగు తల్లడిల్లింది. (Mother Elephant Saves Calf) వెంటనే.. పిల్ల ఏనుగు దగ్గరకు వెళ్లింది. దాన్నితన తుండంతో ఆధారం ఇచ్చింది.
పిల్ల ఏనుగును పట్టుకుని ఒడ్డువైపుకు నెట్టింది. ఆ తర్వాత.. అది మెల్లగా పిల్ల ఏనుగు వెనుకాల వెళ్లి.. దాన్ని ముందటికి నెట్టింది. దీంతో గున్న ఏనుగు ఒడ్డుకు చేరుకుంది. తల్లి ఏనుగు కూడా సంతోషంతో, ఒడ్డువైపుకు వెళ్లిపోయాయి. ఒడ్డున ఏనుగులు కూడా తమ తోటి ఏనుగు కోసం వేచిచూస్తున్నాయి. రెండు ఏనుగులు తిరిగి గుంపులో కలవడంలో అవి అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట (Social media) వైరల్ గా (Viral video) మారింది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.