హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

అడవిలో పెద్దపులికి చుక్కలు చూపించిన కోతి .. వైరల్ గా మారిన ఫన్నీ వీడియో..

అడవిలో పెద్దపులికి చుక్కలు చూపించిన కోతి .. వైరల్ గా మారిన ఫన్నీ వీడియో..

పెద్దపులికి చుక్కలు చూపిస్తున్న కొండెంగ

పెద్దపులికి చుక్కలు చూపిస్తున్న కొండెంగ

Viral Video: అడవిలో చెట్టుమీద కోతి ఎక్కికూర్చుంది. ఇంతలో దాన్ని వేటాడుతూ పెద్దపులి వచ్చింది. కోతి చెట్టుమీదకు ఎక్కికూర్చుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Goa, India

అడవిలో క్రూర జంతువులు, ఇతర జంతువులను వేటాడి తింటుంటాయి. సింహాలు, పులులు, చిరుతపులులు వేటాడి ఇతర జంతువులను తింటాయి. క్రూర జంతువుల బారి నుంచి తప్పించుకొవడానికి సాధు జంతువులు కూడా ప్రయత్నాలు చేస్తుంటాయి. కొన్ని సందర్భాలలో క్రూర జంతువుల బారిన పడి సాధు జంతువులు వాటికి ఆహారంఅయిపోతే.. మరికొన్నిసార్లు మాత్రం క్రూర జంతువులకే, ఇతర జంతువులు చక్మా ఇచ్చి తప్పించుకుంటాయి. ఇప్పటికే జంతువుల వేటకు సంబంధించిన ఎన్నో వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.తాజాగా, మరో వీడియో వైరల్ గా (viral video)  మారింది.

పూర్తి వివరాలు.. అడవిలో చిటారు కొమ్మన కోతి ఎక్కికూర్చుంది. దాన్ని వేటాడుతూ మరో పెద్దపులి చెట్టుమీదకు ఎక్కింది. పెద్ద పులి పైకి ఎక్కిన కొలది.. కోతి దానికి అందకుండా తెగ ప్రయత్నాలు చేస్తుంది. కోతి కడుపుకు ఒక పిల్లకూడా కన్పిస్తుంది. అయితే.. పెద్దపులి ఎంత ప్రయత్నం చేసిన కోతిని మాత్రం పట్టుకోలేకపోయింది.

చివరకు పాపం.. అది బ్యాలెన్స్ తప్పి.. చెట్టుమీద నుంచి నెల మీదకు పడింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media) పెద్దపులికి చుక్కలు చూపిస్తున్న కోతి వీడియో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘భలే తప్పించుకుంది..,’, ‘కోతి లక్ బాగా ఉన్నట్టుంది.. ’ అంటూ కామెంట్ లు పెడుతున్నారు.

ఇదిలా ఉండగా ఉత్తర ప్రదేశ్ లోని హర్దోయ్ కు చెందిన ప్రమోద్ అనే  రైతుకూడా తన ఇంట్లో గేదెను ఉంచుకున్నాడు.

అదంటే రైతుకు ఎంతో ఇష్టం. అయితే... దానికి ఎన్ని దూడలు పుట్టిన రెండు మూడు నెలల్లోనే చనిపోతున్నాయి. దీంతో అతను ఎంతో బాధపడ్డాడు. తనకు ఇష్టమైన గ్రామంలోని దేవతకు తన బాధను చెప్పుకున్నాడు. ఈ క్రమంలో గేదె మరోసారి దూడకు జన్మనించింది.

అది ఆరోగ్యంగా ఉండాలని, దానికి ఏంకావద్దని దేవతకు దండంపెట్టుకుని, గేదె తన వెంట్రులకు దూడకు మూడో ఏడాది రాగానే సమర్పిస్తాన మొక్కుకున్నాడు. అయితే... దూడకు ఏం కాలేదు. అది ఆరోగ్యంగానే ఉంది. గ్రామదేవత దయవలనే దూడబతికిందని అనుకున్నాడు. మొక్కుకున్నట్లే గ్రామ దేవత దగ్గరికి గేదెను, దూడను తీసుకొచ్చాడు. అందరి ముందే దానికి గుండు గీయించాడు. ఆ తర్వాత.. అక్కడికి వచ్చిన గ్రామస్థులకు విందుభోజనం ఏర్పాటు చేశారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో  (Social media) వైరల్ గా (Viral video) మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Tiger, Viral Video

ఉత్తమ కథలు