సాధారణంగా కోతులు, కుక్కలకు జాతీవైరముందంటారు. కొన్ని చోట్ల కుక్కలు, కోతులపై దాడులు చేస్తుంటాయి. మరికొన్ని చోట్ల కోతులు.. కుక్కలను కూడా ముప్పుతిప్పలు పెడుతుంటాయి. అయితే, దీనికి భిన్నంగా మరికొన్ని చోట్ల కుక్కలు, కోతులు జాతీవైరం మర్చిపోయి మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటాయి. కుక్క,కోతులు సరదాగా ఉండటం, వాటి చిలిపి చేష్టలు, నవ్వు తెప్పించే పనుల వంటి అనేక వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియలో వైరల్ గా (Viral video) మారాయి. ఇప్పుడు మరో వీడియో (Social media) నెట్టింట హల్ చల్ చేస్తోంది.
పూర్తి వివరాలు.. పాపం... ఇక్కడ కోతికి బాగా ఆకలేసినట్టుంది. వెంటనే షాపును చూసింది. అక్కడ లేస్ ప్యాకెట్లను గమనించింది. కానీ దానికి అవి అందేలా లేవు. చాలా ఎత్తులో ఉన్నాయి. దీంతో ఆ కోతి ఒక (Monkey) మాస్టర్ ప్లాన్ వేసింది. దీని కోసం అక్కడే ఒక కుక్క నిల్చోని ఉంది. మరీ అవి ముందు నుంచే మంచి ఫ్రెండ్సో.. లేదా.. అనుకోకుండా జరిగిందో కానీ.. కోతి ఎంచక్క కుక్క వీపు మీద నిల్చుంది. వెంటనే అక్కడే ఉన్న చిప్స్ ప్యాకెట్ ను తీసుకొవడానికి ట్రై చేసింది. చిప్స్ ప్యాకెట్ కోసం విశ్వ ప్రయత్నాలు అన్ని చేసింది. ఆ తర్వాత.. కుక్క మీద పడుకుంది. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో (Funny video) నెట్టింట వైరల్ గా మారింది.
ఇదిలా ఉండగా ఇక్కడోక ఆంటీ షాపులో కూల్ గా చీరీకి పాల్పడుతుంది. ఈ ఘటన వైరల్ గా మారింది.
ఒక షాపులో (Shop counter) కొందరు కౌంటర్ దగ్గర బిల్ కడుతున్నారు. ఒక మహిళ మెడలో బ్యాగ్ వేసుకుని కౌంటర్ దగ్గర నిలబడి, షాపు యజమని తో మాట్లాడుతుంది. ఇంతలో మరోక మహిళ బయట నుంచి గాబరాగా వచ్చింది. షాపులోకి వస్తూనే కౌంటర్ దగ్గర ఉన్న మహిళను ఢీకొట్టింది. ఆమెకు తెలియకుండానే బ్యాగు జీప్ తెరచింది. పాపం.. ఇది తెలియని మహిళ ఏదో.. తోపులాటలో మహిళ దూసుకొచ్చిందని అనుకుంది.
ఆ తర్వాత.. షాపు యజమానితో ఏదో అడుగుతున్నట్లు మాట్లాడుతూ.. మరో చేతితో మహిళ బ్యాగులోనుంచి (Woman steals money) డబ్బును మెల్లగా తీసి, మహిళ తన బ్యాగులో వేసుకుంది. ఆ తర్వాత.. మెల్లగా అక్కడి నుంచి చెక్కెసింది. అయితే, మహిళ నిర్వాకం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో (cc camera) రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ఆంటీ క్యా బాత్ హై.. నీది మాములు తెలివి కాదుగా అంటూగా కామెంట్ లు పెడుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.