• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • VIRAL VIDEO MINOR BOY ATTACKS MINOR GIRL IN UTTAR PRADESH OVER SEX ENTIRE ACT RECORDED IN CCTV VIRAL VIRAL ON SOCIAL MEDIA NK

Viral Video: సెక్స్ వద్దన్నందుకు యువతిని చితకబాదాడు... సీసీటీవీలో దారుణం రికార్డ్

Viral Video: సెక్స్ వద్దన్నందుకు యువతిని చితకబాదాడు... సీసీటీవీలో దారుణం రికార్డ్

Viral Video: మన దేశంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలకు సేఫ్టీ మాటలకే పరిమితం అవుతోంది. ఈ దారుణ వీడియో చూస్తే... మీకు కూడా అతనిపై పిచ్చి కోపం రావడం ఖాయం.

  • Share this:
    Viral Video: ఉత్తరప్రదేశ్... మొరాదాబాద్‌లో జరిగిన ఓ ఘటనపై అక్కడి విద్యార్థి సంఘాలు, యువత... తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో ఓ మైనర్ బాలికను... ఇష్టమొచ్చినట్లు చితకబాది, కాళ్లతో తన్ని... నానా రభస చేశాడు ఓ మైనర్ యువకుడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో... పోలీసులకు ముచ్చెమటలు పెట్టాయి. అసలేం జరిగిందంటే... ఆ యువకుడు కొన్నాళ్లుగా ఆ బాలిక వెంట పడుతున్నాడు. ప్రేమిస్తున్నానని నాటకాలు ఆడాడు. ఆమె స్పందించలేదు. ఈమధ్య ప్రేమ కాకపోతే... సెక్స్‌కి ఒప్పుకో అని బలవంతం చెయ్యడం మొదలుపెట్టాడు. ఆమె చాలా భయపడింది. ఈ విషయం ఇంట్లో కూడా చెప్పకుండా సైలెంట్ అయ్యింది.

    తాజాగా ఓ వీధిలో ఆమె వెళ్తుండగా... స్కూటీపై వచ్చాడు. సెక్స్‌కి ఒప్పుకోమని సైగ చేశాడు. ఆమె ఒప్పుకోలేదు. అంతే..., స్కూటీ దిగి... ఆమెను చితకబాదాడు, ఆమె తలను గోడకేసి కొట్టాడు. రెండు చెంపలూ వాయించేశాడు. కాలితో పొట్టలో తన్నాడు. జుట్టు పట్టుకొని నేలపై విసిరికొట్టాడు. అక్కడితో అయిపోలేదు. నేలపై పడి... విలవిలలాడుతున్న ఆమెను కాళ్లతో మళ్లీ మళ్లీ తన్నాడు. మళ్లీ చితకబాదాడు. ఆమె కింద పడిగి గిలగిలా కొట్టుకుంటుంటే... స్కూటీతో వెళ్లిపోయాడు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ దారుణ వీడియో మీరూ చూడండి.

    ఆ బాలికను స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు బాలిక తండ్రి కంప్లైంట్ ఇస్తే... పోలీసులు... చూస్తాం... అంటూ పట్టించుకోకుండా నాటకాలు ఆడారు. ఆ తర్వాత సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలోకి వచ్చాయి. ఆ కుర్రాడిపై పోలీసులు చర్యలు తీసుకోవట్లేదని ప్రజలు భగ్గుమన్నారు. దాంతో పోలీసులకు ముచ్చెమటలు పట్టాయి. గబగబా సీసీటీవీ పరిశీలించి... స్కూటీ నంబర్ ఆధారంగా అతన్ని కనిపెట్టి... అరెస్టు చేశారు. అతను మైనర్ కాబట్టి... జువెనైల్ చట్టం, పోక్సో చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు.

    ఇది కూడా చదవండి: Gold rate 8-5-2021: 37 రోజుల్లో 3,710 పెరిగిన బంగారం ధర... నేటి రేట్లు ఇవీ...

    ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను మొదట స్థానిక ఆస్పత్రికి తరలించి... తర్వాత జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆమెను బతికించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. పేరెంట్స్... ఇలా జరుగుతున్నాయి బయట. మీ పిల్లల విషయంలో తల్లిదండ్రులుగా మీరు వారితో ఫ్రెండ్లీగా ఉండండి. అప్పుడు వారు ఇలాంటి ఘటనలేవైనా జరిగితే... ముందుగానే మీతో చెప్పేందుకు వీలవుతుంది.
    Published by:Krishna Kumar N
    First published: