Viral Video : నీటి అడుగున ఆక్సిజన్ లేకుండా డ్యాన్స్..ఈ భామ సూపర్ వుమెన్ సిస్టర్ అనుకుంటా..

Photo Credit : Instagram

Viral Video : దాదాపు మూడు నిమిషాల పాటు ఆమె డ్యాన్స్ చేసింది. డ్యాన్స్ అంటే ఎదో కాలూ చేయీ కదిపేసి మమ అనిపించడం కాదు. వస్తున్న సంగీతానికి అనుగుణంగా.. రిథమిక్ గా వెరైటీ చూపిస్తూ ఆమె చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంటోంది.

  • Share this:
    మీరు డ్యాన్స్ ఎప్పుడైనా నీటిలో చేయడం చూశారా? నీటిలో డ్యాన్స్ ఏంటి అనుకుంటున్నారా. అసలు నీటిలో పూర్తిగా మునిగితే ఊపిరాడక చస్తాం. ఒకవేళ ఎదో ఆక్సిజన్ వంటివి పెట్టుకుంటే కొద్దిగా నీటిలో ఉండగలం కానీ కాలు చేయీ కదపాలంటేనే విపరీతమైన కష్టం. మరి డ్యాన్స్ అంటారేంటి అనుకుంటున్నారు కదూ. అవును, ఓ డ్యాన్సర్ నీటిలో డ్యాన్స్ చేసి అద్భుతం సృష్టించింది. దాదాపు మూడు నిమిషాల పాటు ఆమె డ్యాన్స్ చేసింది. డ్యాన్స్ అంటే ఎదో కాలూ చేయీ కదిపేసి మమ అనిపించడం కాదు. వస్తున్న సంగీతానికి అనుగుణంగా.. రిథమిక్ గా వెరైటీ చూపిస్తూ ఆమె చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంటోంది. ఫ్రాన్స్ కు చెందిన బాస్టియన్ సోలైల్ దర్శకత్వం వహించి నిర్మించిన ఈ వీడియో నీటిలో 10 మీటర్ల అడుగున చిత్రీకరించారు. స్వీయ కొరియోగ్రఫీతో అరియాడినో హఫీజ్ ఈ డ్యాన్స్ చేసింది. నీటి అడుగుభాగంలో ఈ డ్యాన్స్ కోసం వారు ఎటువంటి ఆక్సిజన్ పరికరాలూ ఉపయోగించలేదు. ఈ చిత్రీకరణ జరుగుతున్న సమయంలో యూనిట్ అంతా..120 సార్లు ఆ నీటి నుంచి బయటకు రావాల్సి వచ్చిందట.

    చక్కటి లైటింగ్.. దానికి తగ్గ కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్.. చిన్న సెట్ నీటి అడుగుభాగాన ఏర్పాటు చేసి తీసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ వీడియోను చాలా మంది చూసి తమ అనుభూతిని కామెంట్ రూపంలో చెబుతున్నారు.



    ఇష్టం.. ఏదైనా కానీయండి.. దానిని నేర్చుకోవడం ఒక ఎత్తయితే.. దానిలో కొత్తదనాన్ని ఆవిష్కరించడం మరో ఎత్తు. అలానే చేసి ఇప్పుడు అందరి మన్ననలు పొందుతోంది అరియాడినో హాఫీజ్. ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయింది. ఆమె వీడియో నెటిజన్లు తెగ చూసేస్తున్నారు. వారెవ్వా అంటూ ఆమె చేసిన విన్యాసానికి ఫిదా అవుతున్నారు. హాఫీజ్ కు సోషల్ మీడియాలో బోలెడంత మంది అభిమానులున్నారు. ఆమె డ్యాన్స్ వీడియోలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూసేవారు బోలెడు.
    Published by:Sridhar Reddy
    First published: