VIRAL VIDEO MASSIVE PYTHON ATTACKS BABY COW LATCHES ONTO ITS LEG PAH
Viral video: వామ్మో.. ఆవు దూడను పట్టుకున్న భారీ కొండ చిలువ.. వైరల్ అవుతున్న భయానక వీడియో..
ఆవు దూడ మీద దాడి చేస్తున్న కొండ చిలువ
Python: ఒక కొండ చిలువ ఆవుల కొట్టంలోనికి ప్రవేశించింది. అది దాదాపు పది అడుగుల పొడవు ఉంది. ఈ క్రమంలో అది అక్కడే ఉన్న ఆవులేగలపై దాడి చేసింది. ప్రస్తుతం ఈ భయానక వీడియో వైరల్ గా మారింది.
Massive Python Attacks Baby Cow Latches Onto Its Leg: సాధారణంగా పాములు, కొండ చిలువలు అంటే చాలా మంది భయంతో వణికిపోతుంటారు. అసలు .. వాటి పేరు ఎత్తడానికి కూడా చాలా మంది ధైర్యం చేయరు. పొరపాటున.. పాము ఎక్కడైన కనిపిస్తే.. ఆ ప్రదేశం దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా సాహాసించరు. పాము అంటేనే వారి వెన్నులో వణుకు పుడుతుంది. పాములు సాధారణంగా ఆహారం కోసం కొన్నిసార్లు దారితప్పి మానవ ఆవాసాలలో ప్రవేశిస్తాయి. ఇవి ఎలుకలను, పందికొక్కులను తింటాయి. ఒక్కొసారి ఇవి కొళ్ల కొట్టంలోకి ప్రవేశిస్తుంటాయి.
చిన్న కొడిపిల్లలను, పిట్టల గుడ్లను ఆహారంగా తింటాయి. ఇక కొండ చిలువలు చాలా బలంగా ఉంటాయి. ఇవి.. మనుషులను కూడా మింగేస్తాయి. కొండ చిలువలు తమ కన్నా పెద్దవైన జీవులను చుట్టి వారి ఎముకలు విరగ్గోట్టి ఆ తర్వాత.. అమాంతం మింగేస్తాయి. అవి కుక్కలు, మేకలు, చిన్న జంతువును మింగుతాయి. సాధారణంగా సోషల్ మీడియాలో పాములు, కొండ చిలువల వీడియోలు అనేకం వైరల్ అయ్యాయి. ఇవి వేరే జంతువుల మీద చేసిన దాడి ఘటనలు, ఇతర జీవులను మింగిన ఘటనలు ఇది వరకే వైరల్ అయ్యాయి.
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని భయంకరంగాను, మరికొన్ని ఫన్నీగాను ఉంటాయి. కొందరు నెటిజన్లు చూడటానికి భయకరంగా ఉన్న వీడియోలు చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఈ కోవకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు.. ఒక కొండ చిలువ పశువుల కొట్టంలోకి ప్రవేశించింది. అక్కడ చిన్న లేగ దూడలు మాత్రమే ఉన్నాయి ఆ కొండ చిలువకు బాగా ఆకలేసినట్టుంది. అది దాదాపు పది అడుగుల పెద్దదిగా ఉంది. కొండ చిలువ ఒక్కసారిగా అక్కడున్న ఆవులపై దాడి చేసింది. దాన్ని చూడగానే ఆవులన్ని దూరంగా పారిపోయాయి. ఈ క్రమంలో ఒక చిన్న ఆవు మాత్రం దాని నోటికి చిక్కింది. దూడ గట్టిగా అరుస్తూ ఎంత విడిపించుకుందామనుకున్న సాధ్యపడలేదు. అది బలంగా ఆవును తనవైపుకు లాగుతుంది. ఆవు దాని నోటి నుంచి విడిపించుకోవడానికి తన శక్తినంతా కూడకట్టుకుని మరీ ప్రయత్నిస్తుంది. అయినా.. కొండ చిలువ దాన్ని వదలలేదు.
ఇక మిగతా ఆవులు అక్కడి నుంచి పారిపోయాయి. ఆవు అక్కడే పరిగెడుతూ.. దాని పట్టునుంచి విడిపించుకోవడానికి ప్రయత్నించింది. అయితే, ఆవు పిల్ల కొండ చిలువ బారినుంచి తప్పించుకుందా.. లేదా దానికి ఆహారంగా మారిపోయిందా అన్నవివరాలు మాత్రం లేదు. ఈ వీడియోను వైల్డ్ లైఫ్ ఎనిమల్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. పాపం.. ఆవు బతకాలి.. కొండ చిలువను చూస్తుంటే భయం వేస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.