Massive pollen filled tree falls on FedEx truck: అమెరికాలోని కోస్టారికాలో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై ప్రయాణిస్తున్న ఒక ట్రక్కుకు అనుకొని ప్రమాదం ఎదురైంది. అక్కడ ఉన్న చెట్లలోని ఒక.. మహావృక్షం కుప్పకూలి కింద పడింది. అది రోడ్డుపై ప్రయాణిస్తున్న.. తెలుపు రంగు ట్రక్ పై పడింది. దీంతో చుట్టు పక్కల వారు షాకింగ్ తో పరుగులు పెట్టారు. అయితే, దూరం నుంచి కొంత మంది వీడియో తీస్తున్నారు.
అనుకొకుండా ఈ సంఘటన వారి ఫోన్ లో రికార్డు అయ్యింది. దీంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ప్రస్తుతం ఘటనలో ఎవరు గాయపడలేదు. కానీ ట్రక్ అద్దాలు పగిలాయి. వాహానం కొద్దిగా దెబ్బతింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అయితే, యూఎస్ లోని కొన్ని చెట్లు పుప్పొడితో ఉంటాయి. అవి చాలా పల్చగా ఉంటాయి. కొద్ది పాటి గాలులకే కూకటి వేర్లతో సహా పైకి వచ్చి పడతాయి. ప్రస్తుతం ఇది కూడా అలాంటి గాలుల వలన పడి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఘటనపై గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.
తెలంగాణ(Telangana)లో హరితహాతం ఓ యజ్ఞంలా సాగిపోతోంది.
రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపేయాలని కాలుష్య రహిత రాష్ట్రంగా మార్చేందుకు గ్రీన్ ఛాలెంజ్ (Green Challenge)కార్యక్రమం దోహదపడుతోంది. ఇలాంటి వినూత్న కార్యక్రమాల మధ్యలోనే మరో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తెలంగాణ ఎక్సైజ్‌శాఖ మంత్రి(Excise Minister )శ్రీనివాస్‌గౌడ్ (Srinivas Goud). మహబూబ్‌నగర్ Mahabubnagarజిల్లాలో చరిత్రకు సాక్ష్యంగా వందల ఏళ్లుగా స్వచ్ఛమైన గాలిని అందిస్తూ ప్రకృతి ఆస్తిగా భావించే భారీ వృక్షాలను రీ ట్రాన్స్ లొకేషన్ (Re trans location)పేరుతో తిరిగి నాటించారు. ఈ అద్భుతమైన కార్యక్రమం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కేసీఆర్ అర్బన్ ఎకో పార్కు(KCR Urban Eco Park)లో నాటారు.
భారీ చెట్లకు పునర్జన్మ..
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఉన్న వందల ఏళ్లుగా ఉన్న నాలుగు భారీ వృక్షాలను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త , టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ సహకారంతో భారీ యంత్రాలతో పెద్ద వృక్షాలను రీ ట్రాన్స్ లొకేషన్ ద్వారా జాగ్రత్తగా తరలించి..కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్‌లో నాటించారు.
చెరిగిపోని వందేళ్ల వృక్ష చరిత్ర..
మహబూబ్‌నగర్‌లోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో అధునాతన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈక్రమంలోనే అక్కడ ఉన్న వంద సంవత్సరాలకుపైగా ఉన్న నాలుగు భారీ వృక్షాలకు ఎలాంటి నష్టం జరగకుండా వాటిని జాగ్రత్తగా మరోచోట నాటడం వల్ల స్థానికులు, జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. స్వచ్ఛమైన గాలిని ఇస్తూ వందల ఏళ్లుగా చరిత్రకు చిహ్నాలుగా నిలిచిన చెట్లను కాపాడేందుకు ప్రభుత్వం ఈ విధంగా చొరవచూపడం అభినందనీయమన్నారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.