• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • VIRAL VIDEO MAN SHOWS OPENING BEER BOTTLE WITH SHOELACE SU

Viral Video: బీర్ బాటిల్ మూత ఇలా ఓపెన్ చేయడం ఎప్పుడైనా చూశారా..?.. మీరు ఓ లుక్కేయండి..

Viral Video: బీర్ బాటిల్ మూత ఇలా ఓపెన్ చేయడం ఎప్పుడైనా చూశారా..?.. మీరు ఓ లుక్కేయండి..

(Image-Twitter)

చాలా మంది బీర్ బాటిల్ మూతను పలు రకాలుగా ఓపెన్ చేస్తుంటారు. కొందరు పళ్లతో ఓపెన్ చేస్తే.. మరికొందరు టేబుల్ బల్ల అంచుకు పెట్టి బీర్ బాటిల్ మూతను ఓపెన్ చేయడం సాధారణంగా అందరికి తెలిసిన సంగతే.

  • Share this:
    మందు సిట్టింగ్‌లో ఉన్నప్పుడు చాలా మంది వారిలోని రకరకాల కళలను ప్రదర్శిస్తుంటారనే సంగతి తెలిసిందే. బీర్ తాగే వ్యక్తులు వారి వద్ద ఓపెనర్ లేకపోతే.. నోటి పళ్లతో మూతను తెరవడం చాలా సందర్భాల్లో జరుగుతూనే ఉంటుంది. ఇక, మరికొందరు తలుపు గొళ్లానికి పెట్టి, బల్ల అంచుకు పెట్టి కూడా బీర్ సీసా మూతను ఓపెన్ చేస్తుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం చాలా డిఫరెంట్‌గా బీర్ బాటిల్ మూతను ఓపెన్ చేశాడు. షూ లేస్‌ సాయంతో బీర్ బాటిల్ మూతను ఓపెన్ చేశాడు. బీర్ బాటిల్ మూత చుట్టూ షూ లేస్ చుట్టేసి.. పైకి వేగంగా గట్టిగా లాగుతాడు. దీంతో బీర్ బాటిల్ మూత చాలా సులువుగా తెరుచుకుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడయాలో వైరల్‌గా మారింది.

    Hold My Beer అనే ఖాతా నుంచి ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. దానికి మనసు ఉంటే మార్గం కూడా ఉంటుందని అనే క్యాప్షన్‌ను కూడా జత చేశారు. 9 సెకన్ల నిడివి గల ఈ వీడియోపై నెటిజన్లు కూడా చాలా ఫన్నీగా స్పందిస్తున్నారు. కొందరు అతన్ని జీనియ‌స్ అని కొనియాడారు. మరో నెటిజన్.. ఈ విషయం నాకు ఇప్పటివరకు తెలియకుండా పోయిందే అంటూ కామెంట్ చేశాడు.









    ఇక, మరికొందరు తాము బీర్ బాటిల్ మూతను ఎలా ఓపెన్ చేస్తామో తెలిపే టెక్నిక్‌లను కూడా ట్విట్టర్‌లో షేర్ చేస్తున్నారు. ఇక, ఇప్పటివరకు 38 వేలకు పైగా నెటిజన్లు ఈ వీడియోను వీక్షించారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు