అమెరికా సంయుక్త రాష్ట్రాలలో పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన గాట్లిన్‌బర్గ్ టేనస్సీలో జరిగిన ఓసంఘటన ఇప్పడు వైరల్‌గా మారింది. ఈ ప్రాంతం ఎలుగుబంట్లకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడకు వీకెండ్ పార్టీకోసం వచ్చిన డీల్ అనే వ్యక్తి కారులోకి ఎలుగుబంటి చొరబడింది. డీల్ అతని స్నేహితులు ఈ కారు డోర్ తీసి ఈ ఎలుగుబంటినిచక్కగా సాగనంపిన వీడియో వైరల్‌గా మారింది. గాట్లిన్‌బర్గ్ టేనస్సీ పర్వతాలతో పర్యాటకులను ఆకట్టకుంటూ ఉంటుంది. ఇక్కడి పర్వతాలు, నేషనల్ పార్కు ప్రధాన ఆకర్షణలు. దీంతో ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఫలితంగా ఇక్కడ అత్యధికంగా ఉండే ఎలుగుబంట్లు మనుషులంటే భయపడటం మానేశాయి. దీంతో అవి యధేచ్ఛగా పర్యాటకుల వద్దకు రావడం, వారి కార్లలో తినడానికి ఏమైనా దొరుకుతాయోమోనని వెదుకుతుంటాయి.
ఈనేపథ్యంలో జోసెఫ్ డీల్ అతని మిత్రులు ఈ ప్రాంతానికి తమ తమ కార్లలో వచ్చారు. అక్కడ పార్టీ చేసుకున్నారు. తరువాత రాత్రి ఏడుగంటల సమయంలో వారు నిద్రకు ఉపక్రమించారు. ఆ సమయంలో ఎలుగుబంటి అరుపులు వినిపించాయి. అయితే వాటిని లైట్‌గా తీసుకున్న జోసెఫ్ అతని మిత్రులు పెద్దగా స్పందించలేదు. కానీ అదేపనిగా అరుపులు వినిపిస్తుండటంతో ఏం జరిగిందో చూద్దామని బయటకు వచ్చారు. ఈసందర్భంగా జోసెఫ్ తన కారు కదులుతున్నట్టుగా గుర్తించాడు. తీరా దగ్గరకు వెళ్ళి చూసే సరికి ఓ నల్లని ఎలుగుబంటి పాపం కారులో చిక్కకుపోయి కనిపించింది.
జోసెఫ్ బృందానికి ఎలుగుబంటిని చూడగానే ముచ్చెమటలు పట్టాయి. దాన్ని కారులోంచి ఎలా బయటకు పంపాలో తెలియకఆందోళనకు గురయ్యారు.తరువాత జోసెఫ్ డీల్ ధైర్యం చేసి తన మిత్రులందరినీ కారుకు ఒక పక్కగా ఉండి శబ్దాలు చేస్తూ ఉండమని తాను కారు డోర్ తీస్తానని చెప్పాడు. ఈమేరకు అతని స్నేహబృందం ఓ పక్క నుంచుని సౌండ్స్ చేస్తుండగా జోసెఫ్ డీల్ కారు ఫ్రంట్‌డోర్ తీశాడు. వెంటనే ఎలుగుబంటి తాపీగా బయటకు వచ్చి జోసెఫ్‌ను అతని మిత్ర బృందాన్ని థాంక్స్ అన్నట్టుగా ఓ చూపు విసిరి చక్కగా అడవిలోకి వెళ్ళిపోయింది. ఈ ఉదంతాన్నంతా వీడియోగా చిత్రీకరించారు. తరువాత డీల్ దాన్ని తన టిక్‌టాక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. లక్షలాదిమంది ఈ వీడియోను చూశారు.
అయితే డీల్, అతని మిత్ర బృందం ఎలుగుబంటికి అంత దగ్గరగా వెళ్ళడం శ్రేయస్కరం కాదని, అది అడవి జంతువు కాబట్టి మనుషులను చంపేయచ్చులేదా గాయపరచవచ్చు అంటూ ఓ టిక్‌టాక్ యూజర్ కామెంట్ చేశాడు. ఇక ఆహారపదార్థాల కోసం డీల్ కారులోకి దూరిన ఎలుగుబంటి అతని కారును బాగానే డామేజ్ చేసింది. ఓ తలుపు విరిగిపోయింది. కారు రూఫ్ బాగా దెబ్బతింది. దీంతో ఆగిపోలేదు ఆ రోజు రాత్రి మరోసారి కొన్ని ఎలుగుబంట్లు ఈ కారువద్దకు వచ్చినట్టుగా వీడియో ఫుటేజీ చూపించింది. ఎలుగుబంటి కారును బాగా దెబ్బతీయడంతో కారును అక్కడే వదిలేసిన డీల్‌కు మరో షాక్ తగిలింది. ఎంచక్కా దొంగలు డీల్ కారులోని బ్యాటరీ ఇతర భాగాలను దొంగిలించుకుపోయారు. నిజానికి ఎలుగుబంట్లు చాలామంచివి. అవి నాకు టిక్‌టాక్ లాటరీ తగిలేలా చేశాయి. కానీ దొంగలే .. నా సొమ్ము దోచుకుపోయారంటూ డీల్కామెంట్ చేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.