Man Rescues Baby Dolphin From Fishing Net: సముద్రం లోపల వివిధ రకాల చేపలు, జీవులు ఉంటాయి. షార్క్ లు, తిమింగిలాలు, ఆక్టోపస్ లు, డాల్ఫిన్, సముద్ర సర్పాలు, మొసళ్లు ఉంటాయి. జాలర్లు తమ బోట్ లు లేదా పడవలలో సముద్రం లోపలికి వెళ్లి వలను వేస్తారు. అక్కడ చాలా చేపలు ఉంటాయి. వారి వలలో అవి చిక్కుకుంటుంటాయి. ఒక్కొసారి చేపలతో పాటు.. పెద్ద జీవులు కూడా వలలో చిక్కుకున్న అనేక సంఘటనలు కూడా గతంలో వార్తలలో వచ్చాయి. కొన్ని సార్లు, చేపలతో పాటు, సర్పాలు వస్తే.. మరికొన్ని సార్లు.. షార్క్ లు కూడా వలలో చిక్కుకున్నాయి. అయితే, ప్రస్తుతం వీడియోలో, జాలరీ వేసిన వలలో ఒక బేబీ డాల్పిన్ చిక్కుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు.. సముద్రంలో చేపల కోసం ఒక జాలరీ వల వేశాడు. అతగాడు చాలా సేపు వలను నీళ్లలోనే ఉంచాడు. ఆ తర్వాత.. తన బోట్ లో కూర్చుని మెల్లగా వలను పైకి లాగాడు. అప్పుడు వల చాలా బరువుగా అనిపించింది. పెద్ద చేపలే పడ్డట్టున్నాయని బలంగా దాన్ని పైకి లాగాడు. అప్పుడు వల పైకి రాగానే చూసి షాక్ కు గురయ్యాడు. వలలో ఒక బేబీ డాల్ఫిన్ ఉండటాన్ని చూశాడు.
అనుకొకుండా చిక్కిందని దాన్ని వలనుంచి తొలగించాడు. దానితో ప్రేమగా ఆడుకున్నాడు. సాధారణంగా డాల్ఫిన్ లు చాలా యాక్టివ్ గా, తెలివి తేటలతో కూడి ఉంటాయి. మనుషులతో స్నేహంగా ఉంటాయి. అవి మనుషులకు ఎలాంటి హనీ తలపెట్టవు. అయితే, జాలరీ దాన్ని కున్న వలను తొలగించి, ముద్దాడి తిరిగి సముద్రంలోనే వదిలేశాడు. ఇది గతంలోనే జరిగింది. ప్రస్తుతం మరోసారి వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. జాలరీ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ocean, Viral Video