Video: చిత్రవిచిత్రం... తొండను పెంచుకుంటున్నాడు.. ఎందుకో తెలుసా?

తొండను పెంచుకుంటున్నాడు (image credit - youtube)

Viral Video: 2011లో వచ్చిన యానిమేషన్ సినిమా Rango అతనికి బాగా నచ్చిందా? అందుకే తొండను పెంచుకుంటున్నాడా... వివరాలు తెలుసుకుందాం.

 • Share this:
  Video: మీరు జంతు ప్రేమికులు అయితే... కుక్కనో, పిల్లి (pet animals) మీతో పాటూ... సరదాగా వాకింగ్‌కి తీసుకెళ్తారు. అవి ఇతరుల్ని కరవకుండా వాటికి తాడు కట్టి ఆ తాడును వదలకుండా పట్టుకుంటారు. తద్వారా అవి మీ కంట్రోల్‌లో ఉంటాయి. ఇలాంటి దృశ్యాల్ని మనం రోడ్లపై, పార్కుల్లో చూస్తూనే ఉంటాం. కొంతమంది తమ కుక్కలను కారులో తీసుకెళ్తారు. వాటికి రకరకాల స్కిల్స్ నేర్పిస్తారు. వాటికి తాడు లేకపోయినా కంట్రోల్ లోనే ఉంటాయి. పోలీసులు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చి, నేరస్థులను కనిపెట్టేందుకు కుక్కల సర్వీసును వినియోగించుకుంటారు.

  ఎవరు ఏ జంతువును తీసుకెళ్లినా... తొండ (Lizard)ను మాత్రం ఎవరూ అలా తీసుకెళ్లరు. అసలు తొండను ఎవరు పెంచుకుంటారు. కానీ అమెరికా... ఫ్లోరిడా (Florida)లోని అతను మాత్రం తొండను పెంచుకుంటున్నాడు. దాని మెడకు తాడు కట్టి... తనతో పార్కులో తీసుకెళ్తున్నాడు. ఆ తొండ కూడా అతను చెప్పినట్లే వింటోంది. తుర్రున పరుగెడుతూ... తాడు ఎంత దూరం రాగలదో అంత దూరం వెళ్తోంది. ఆ తర్వాత నోరు తెరచి ఆహారం అడుగుతోంది. పక్షి తన పిల్లలకు ఆహారం పెట్టినట్లుగా అతని తన చేత్తో తొండ నోట్లో ఆహారం (feeding) వేస్తున్నాడు. అలా అది లంచ్ చేస్తూ అతనితో ముందుకెళ్తోంది.

  ఆ విచిత్రమైన వీడియో (viral video)ని ఇక్కడ చూడండి.

  ఈ వీడియోని తొండల సంరక్షకులు టామ్మీస్ రెప్టైల్స్... టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇది పూర్తి భిన్నంగా ఉండటంతో... ఈ వీడియోని నెటిజన్లు ఆశ్చర్యపోతూ చూస్తున్నారు. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు అంటున్నారు. కొందరేమో తొండకు తాడు కట్టడం హింసాత్మకం అనీ దాన్ని స్వేచ్చగా వదిలేయాలని కోరుతున్నారు. మరికొందరేమో... అది తొండా లేక... జురాసిక్ పార్క్ (Jurassic Park) సినిమాలోని పిల్ల డైనోసారా (Dilophosaurus) అని అడుగుతున్నారు. దాన్ని చూస్తే అలాగే ఉందంటున్నారు.

  ఇది కూడా చదవండి: తుప్పల్లో యువతి చెయ్యి.. షాకింగ్ మిస్టరీ కేసును తెలివిగా ఛేదించిన పోలీసులు

  ఇంతకీ ఈ తొండకు సైంటిఫిక్ నేమ్ ఉంది. దీన్ని క్లామిడోసారస్ (Chlamydosaurus) లేదా ఫ్రిల్ల్‌డ్ డ్రాగన్ (Frilled Dragon) అంటారు. ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియా, సౌత్ న్యూగినియాలో కనిపిస్తుంటాయి. ఇవి ఎవరికీ ఏ హానీ తలపెట్టవు. ఇవి గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పరుగెట్టగలవు. ఇవి చూడటానికి డ్రాగన్ లాగా ఉంటాయి. ఇవి చెట్లపైనే ఎక్కువగా నివసిస్తాయి. పురుగులు, కీటగాల్ని తిని బతుకుతాయి. అప్పుడప్పుడూ మొక్కల్ని తింటాయి. అలా ఎందుకు చేస్తాయో సైంటిస్టులకే తెలియలేదు. వీటిలో పెద్ద తొండ తోకత కలిపి 85 సెంటీమీటర్లు పొడవు పెరుగుతుంది. చాలా మంది ఇవి భూమికి సంబంధించినవి కావు అని అభిప్రాయపడుతుంటారు.
  Published by:Krishna Kumar N
  First published: