• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • VIRAL VIDEO MAN HELPS SNAKE DRINK WATER FROM BOTTLE IN TAMIL NADU SU

Viral Video: ఏమాత్రం భయపడకుండా.. పాము దగ్గరగా వెళ్లి వాటర్ బాటిల్‌తోనే నీరు తాగించాడు..

(Image- Twitter/@PramodMadhav6)

ఆకలి విషయానికొస్తే భూమి మీద జీవరాశులన్నీ ఒకటే. ఆకలి, దప్పికను తీర్చుకోవడం కోసమే ప్రతి ప్రాణి పోరాడుతుంటుంది.

  • Share this:
    చాలా మంది పాములను చూస్తే భయపడిపోతుంటారు. బయట పాములు కనబడితే అక్కడి నుంచి పరుగులు పెడతారు. అదే ఇంట్లో, పరిసరాల్లో పాములు ఉంటే వెంటనే.. వాటిని అక్కడి నుంచి పంపేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం పాముకు నీరు తాగించాడు. పాము దగ్గరగా వెళ్లి వాటర్ బాటిల్‌తో పాము నోటిలో నీళ్లు పోశాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాలు.. తమిళనాడులోని కడలూరు ప్రాంతంలో ఓ వ్యక్తి.. దాహంతో ఉన్న పాము వద్దకు ఎటువంటి భయం లేకుండా దగ్గరగా వెళ్లాడు. ఓ చేతిలో పాము తోకను పట్టుకుని, మరో చేతితో వాటర్ బాటిల్ పట్టుకున్నారు. పాము ముందు నిల్చుని ఎటువంటి భయం లేకుండా వాటర్ బాటిల్‌లో నుంచి నీటిలో పాము నోటీలో పోశాడు. పాము కూడా అతడు పోసిన నీటిని తాగి దాహం తీర్చుకుంది. అనంతరం పామును సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు.

    అక్కడున్న కొందరు ఈ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు. ఈ వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Pramod Madhav అనే వ్యక్తి ట్విట్టర్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ‘వేసవిలో పాము దాహం తీర్చుతున్న ఓ మంచి మనిషి’అంటూ క్యాప్షన్ జత చేశాడు.





    వింత శిశువు.. తల పంది తల ఆకారంలో.. చర్మంపై పొలుసులు.. ఎక్కడంటే..

    ఇక, ఆ వీడియోలో ఉన్న వ్యక్తిని సెల్వగా గుర్తించారు. అతడు వన్యప్రాణుల పట్ల అతడు ప్రేమను ప్రదర్శిస్తాడని స్థానికులు తెలిపారు. జనవాసాల్లోకి వచ్చే పాములను రక్షించి.. సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడం చేస్తుంటాడని చెప్పారు.
    Published by:Sumanth Kanukula
    First published: