విదేశాలకు వెళ్లే వారికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి చాలామంది ఎయిర్ పోర్టుకు వెళ్తుంటారు. ఒక వేళ విదేశాల నుంచి వస్తుంటే మాత్రం కాస్తంత హడావుడి ఉంటుంది. ఆ సమయంలో ఎయిర్‌పోర్టులో చేసే స్వాగత సత్కారాలు మాములుగా ఉండవు. పూల బొకేలను పట్టుకొని.. ప్లకార్డులను చేతిలో పెట్టుకొని.. స్వాగతం పలుకుతారు. కొంతమంది వాళ్లకు సర్ ప్రైజ్ గిఫ్ట్ లు కూడా తెస్తుంటారు. ఇక ఆ ప్రయాణికులు ఎయిర్ పోర్టులో దిగగానే ఎమోషనల్ అయిపోయి ఆనందంతో గట్టిగా హత్తుకుంటారు.
ఇలాంటివి మనం తరచుగా చూస్తూనే ఉంటాం. తాజాగా వేరేదేశం నుంచి స్వస్థలానికి వచ్చిన.. ఒక తల్లి ఎయిర్‌పోర్టులో తనకు స్వాగతం పలకడానికి వచ్చిన కొడుకు పట్ల వెరైటీగా స్పందించింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఘటనలో ఏముందంటే.. అన్వర్ జలాని అనే వ్యక్తి ఎయిర్ పోర్టులో తన తల్లి కోసం బొకేలు, గిఫ్ట్ లు, ప్లకార్డులు పట్టుకొని నిలబడ్డాడు. ప్లకార్డుపై మిస్ యూ అమ్మా అని రాసి ఉంది. ఇంతలో అతడు ఎవరి రాక కోసం ఎదురు చూస్తున్నాడో.. ఆమె రానే వచ్చింది. ఎయిర్ పోర్టు గుమ్మం నుంచి బయటకు వస్తూ.. ఆమె చెప్పును తన చేతితో పట్టుకొని.. దగ్గరకు వచ్చి మరీ చెంపపై కొడుతుంది. స్వాగతం పలకడానికి వచ్చిన కొడుకు అన్వర్‌ను ఆ తల్లి చెప్పుతో చితక్కొట్టింది. ఆమె కొడుతున్న సమయంలో అతడి వద్ద ఉన్న బొకేలు, గిఫ్ట్ లను కింద పడేసి.. నవ్వుకుంటూ కొంచెం దూరం వెళ్తాడు.
Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి
ఆ తర్వాత .. ఎమోషనల్‌తో అతడిని హత్తుకుంది. ఈ ఘటన పాకిస్థాన్ లోని ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకుంది. దీన్ని అన్వర్ జిలానీ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. "మా అమ్మ తిరిగి వచ్చింది!" అని అన్వర్ వీడియో క్యాప్షన్‌లో రాశారు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు దీనికి దాదాపు 145 మిలియన్ ల కంటే ఎక్కువ సార్లు వీక్షించబడింది. అంతే కాకుండా 6.1 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. మొదట ఈ వీడియో చూసిన నెటిజన్లు కంగుతిన్నారు. సొంత తల్లి అలా చెప్పుతో కొట్టడం ఏంటని అనుకున్నారు. తర్వాత ఆమె ప్రేమను అతడి కొడుకుపై అలా చూపించిందని అర్థం చేసుకున్నారు.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది నవ్వుతూ ఎమోజీలతో కామెంట్లు కురిపిస్తున్నారు. ఒక నెటిజన్ వ్యంగ్యంగా.. ఇలా కామెంట్ చేశారు..“ఆమె ప్రేమను చూపించడానికి సరైన మార్గం” అని వ్యాఖ్యానించారు. ఒక నెటిజన్ ఇలా కామెంట్ చేశాడు.. "15 సంవత్సరాల క్రితం మీరు మీ గదిని ఒకసారి శుభ్రం చేయలేదని ఆమెకు గుర్తుంది" అని చమత్కరించారు. ఆ కోపమే ఆమె ఇలా తీర్చుకుందని అని అన్నారు. ఇక కొంతమంది ఇలా కామెంట్లు చేశారు. పాపం ఆమె అతడిని ఎంతాలా మిస్ అయ్యిందో అని.. నవ్వు ఆపుకోలేకపోతున్నాం అని ఇంకొకరు ఇలా ఫన్నీగా కామెంట్లు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Trending, Viral, Viral Video