Home /News /trending /

VIRAL VIDEO MAN DANCES WITH WOMAN AT WEDDING ANOTHER MAN TRIES TO DANCE WITH HIM FORCEFULLY PAH

Viral Video:  ఓర్ని పెళ్లిలో ఇదేం పనిరా అయ్యా.. అందరి ముందే.. కొంచెం కూడా బుద్ధి లేకుండా..?

డ్యాన్స్ చేస్తు కొట్టుకుంటున్న యువకులు

డ్యాన్స్ చేస్తు కొట్టుకుంటున్న యువకులు

Wedding: పెళ్లి వేడుకలో అందరు హుషారైన స్టెప్పులతో జోష్ గా డ్యాన్స్ చేస్తున్నారు. ఇంతలో వేదికపైకి ఒక వ్యక్తి మహిళను తీసుకొని వచ్చాడు. ఆమెతో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు.

మన దేశంలో పెళ్లి వేడుకలు  (Wedding) ఒకప్పటిలా ఉండట్లేదు. నేటి యువత ట్రెండ్ కు తగ్గట్టుగా వెడ్డింగ్ లను స్పెషల్ గా ప్లాన్ లు చేస్తున్నారు. బంధువులు, స్నేహితులతో కలిసి హుషారుగా తమ పెళ్ళి వేడుకను కలకలం గుర్తుండిపోయేలా ఒక తియ్యని అనుభూతిలా మలుచుకొవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రీవెడ్డింగ్ షూట్ నుంచి అప్పగింతల వరకు ప్రతి ఒక్క కార్యక్రమం స్పెషల్ గా ఉండేలా చూసుకుంటున్నారు. ఇక పెళ్ళి వీడియోలకు ప్రతి రోజు వైరల్ అవుతున్నాయి.

వెడ్డింగ్ లో జరిగే వింత పనుల వలన ఆ పెళ్లి కాస్త వైరల్ (Viral video) అవుతున్నాయి. కొంత మంది పబ్లిసిటీ కోసం ఇలాంటి చిలిపి పనులు చేస్తున్నట్లు కామెంట్ లు వస్తున్నాయి. ఇక పెళ్లిలో డ్యాన్స్ లకు సంబంధించి వీడియోలను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వధువరులు, అతిథులు, జోష్ గా తీన్మార్ స్టెప్పులతో (Teenamar steps)  డ్యాన్స్ లు చేస్తుంటారు. ఒక్కొసారి పెళ్లిలో డ్యాన్స్ లో ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. ఈ కోవకు చెందిన వీడియో ప్రస్తుతం (video viral)  వైరల్ గా మారింది.



పూర్తి వివరాలు.. ఈ వీడియోలో ఒక వైపు కొత్త జంట కూర్చుని ఉన్నారు. మరోవైపు డీజేలు, సౌండ్ బాక్సులతో కొంత మంది డ్యాన్స్ లతో (Dance)  అదరగొడుతున్నారు. వధు,వరులు తమ స్నేహితులు, బంధువులు చేస్తున్న డ్యాన్స్ లను ఆసక్తి గా చూస్తున్నారు. పాటలను కూడా పెద్ద ఎత్తున జోర్దార్ గా పెట్టారు. వారిలో కొంత మంది మద్యం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక వారికి వేరే లోకం. మాస్ స్టెప్పులతో హల్ చల్ చేస్తున్నారు. స్టేజీమీద యువకులు, పెద్ద వారు పాటలు, మ్యూజిక్ కు తగ్గట్టుగా అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నారు. ఇంతలో ఒక వ్యక్తి.. కిందనుంచి ఒక మహిళలను స్టేజీ మీదకు తీసుకొచ్చాడు. ఆమెతో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు.

అప్పుడు ఒక షాకింగ్ ఘటన జరిగింది. స్టేజీ మీద ఉన్న మరో వ్యక్తి ఇతగాడిని హత్తుకుని పైకి లేపుతు డ్యాన్స్ చేస్తున్నాడు. బలవంతంగా అతడిని కొడుతు, తన్నుతూ డ్యాన్స్ చేశాడు. దీంతో ఒక్కసారిగా అక్కడి వారంతా షాక్ కు గురయ్యారు. అతను మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా యువకులు కల్గజేసుకొని వారిని దూరంగా వెల్లగొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Viral Videos, Wedding

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు