Home /News /trending /

VIRAL VIDEO MAN CATCHES 2 YEAR OLD GIRL FALLING FROM 5TH FLOOR OF BUILDING IN CHINA PAH

Real Hero: ఐదో అంతస్తు నుంచి పడిన చిన్నారి.. ఎలా కాపాడారో చూడండి... వీడియో వైరల్..

బాల్కనీ నుంచి కింద పడ్డ బాలుడు

బాల్కనీ నుంచి కింద పడ్డ బాలుడు

China: చిన్నారి ఐదో అంతస్తు నుంచి వేలాడుతున్నారు. ఇంతలో.. కింద ఉన్న ఇద్దరు బాలుడిని గమనించారు. వెంటనే అక్కడకి పరిగెత్తుకుంటూ వెళ్లారు.

కొంత మంది వెంట్రుక వాసిలో ప్రమాదాల నుంచి బయటపడుతుంటారు. కొన్నిసార్లు.. రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటి సమయాలలో.. కొందరు.. చాకచక్యంగా వ్యవహరిస్తారు. రోడ్డుపైన ప్రయాణించేటప్పుడు వెహికిల్స్ కంట్రోల్ తప్పుతుంటాయి. వర్షాకాలంలో వెహికిల్ స్లిప్ అయి.. భారీ వాహనాల కిందకు వెళ్లిపోతుంది. అదే విధంగా.. మరికొన్ని సార్లు.. రైలు ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు మనం తరచుగా చూస్తునే ఉంటాం. అదే విధంగా, కొన్ని సార్లు పిల్లలు సెల్లార్ లు, టెర్రాస్ ల నుంచి ప్రమాదవశాత్తు కిందపడుతుంటారు. కొన్ని సార్లు.. వీరి లక్ బాగుండి.. బతుకుతుంటారు. ఈ కోవకు చెందిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. చైనాలో (China) షాకింగ్ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న భవంతిపై నుంచి ఒక చిన్నారి ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. దీన్నిగమనించిన మరో వ్యక్తి అక్కడికి పరుగెత్తుకుంటూ వెళ్లాడు. కాగా, దీన్ని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్విటర్ వేదికగా పంచుకుంది. షెన్ డాంగ్ అనే వ్యక్తి రోడ్డు మీద ప్రయాణిస్తున్నాడు. ఇంతలో ఐదో అంతస్థు నుంచి ఒక చిన్నారి కింద అరుస్తు కింద పడ్డాడు.


దీన్ని గమనించిన ఇద్దరు వ్యక్తులు అక్కడికి వెళ్లారు. కింద పడుతున్న చిన్నారిని వెంటనే పట్టుకున్నారు. పాపను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే.. ఈ వీడియో మాత్రం నెట్టింట (Social media)  తెగ వైరల్ గా (Viral video)  మారింది. దీన్నిచూసిన నెటిజన్ లు సదరు వ్యక్తి సమయస్పూర్తికి హ్యట్సాఫ్ అంటూ కామెంట్ లు పెడుతున్నారు.

ఇదిలా ఉండగా మరోక ఘటనలో..  ఒక వ్యక్తి గాడిదపై ప్రతాపం చూపించి ఇరకాటంలో పడ్డాడు.



వీడియోలో మీరు గాడిద మరియు యువకుడిని చూడవచ్చు. గాడిద నిలబడి ఉంది. యువకుడు ఆ గాడిదను కొడుతున్నాడు. తన కుడిచేత్తో దాని ముఖంపై కొట్టాడు. ఆ తర్వాత ఆ యువకుడు తన శక్తి నంతా ఉపయోగించి.. గాడిదను తీవ్రంగా హింసించాడు. బట్టలు ఉతికినట్టుగా గాడిదను బాదాడు. పాపం.. ఈ వీడియోలో గాడిదను చూస్తే మనకు ఆ యువకుడి మీద తీవ్ర కోపం వస్తుంది.

అయితే.. యువకుడు గాడిద సహనానికి ముగింపు పలికాడు. చివరలో గాడిద ఓర్పు నశించి.. అతనిపై తన కోపాన్ని చూపించింది. అక్కడిక్కడే మనోడు తిక్క కుదిర్చింది. యువకుడు కాలును నోటితో పట్టుకుని అతన్ని గిరగిరా తిప్పి నేలపై విసిరికొడుతుంది. యువకుడు తన ప్రాణాలను కాపాడుకోవడానికి పోరాడటం మనం చూడొచ్చు. తనకు జరిగిన అన్యాయానికి గాడిద.. ప్రతీకారం తీర్చుకుంది.
Published by:Paresh Inamdar
First published:

Tags: China, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు