హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Independence day: జానపద కళాకారులతో మమతా బెనర్జీ అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్..

Independence day: జానపద కళాకారులతో మమతా బెనర్జీ అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్..

కళాకారులతో స్టెప్పులు వేస్తున్న మమతా బెనర్జీ

కళాకారులతో స్టెప్పులు వేస్తున్న మమతా బెనర్జీ

West bengal: దేశమంతట స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. జానపద కళాకారులతో కలిసి చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • West Bengal, India

దేశ మంతాట ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్ర్య సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనదేశంతో పాటు, విదేశాలలో ఉన్న వారు కూడా అత్యంత గ్రాండ్ గా వేడుకలు జరుపుకుంటున్నారు. ఢిల్లీలోని (Delhi)  ఎర్రకోటలో ప్రధాని మోదీ త్రివర్ణపతాకం ఎగురవేశారు. అంతే కాకుండా.. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లు.. మనకు స్వాతంత్రం తీసుకురావడానికి తమ ప్రాణాలను సైతం అర్పించిన వారందరికి మోదీ నివాళులు అర్పించారు. ఆయా రాష్ట్రాల సీఎం లు కూడా తమ కార్యాలయాలలో జాతీయజెండాను ఎగురవేసి, మనం దేశం కోసం పోరాడి అసువులు బాసిన వారికి నివాళులు అర్పించారు. అయితే... వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా తన కార్యాలయంలో జాతీయజెండాను ఎగురవేశారు.

కోల్ కతాలో జరిగిన కార్యక్రమంలో.. వేడుకలలో భాగంగా జానపద కళాకారులు ప్రత్యేక కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మమతా, ఉల్లాసంగా పాల్గొన్నారు. జానపద కళాకారులు చేసిన బనీజీ వేడుకలలో పాల్గొన్నారు. కళాకారులతో కలిసి, డ్యాన్స్ చేసి, మరింత జోష్ ను నింపారు. దీంతో వేడుకలకు హజరైన వారంతా ఒక్కసారిగా చప్పట్లతో మమతాను ఉత్సాహపరిచారు. సీఎం తమతో కలసి డ్యాన్స్ చేయడంను చూసి, కళాకారులు కూడా ఆనందంతో పొంగిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా మారింది.

అంతకుముందు.. పశ్చిమ బెంగాల్ సీఎం (Mamata banerjee) కోల్‌కతాలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని జరుపుకుంటూ రెండు ట్వీట్లను కూడా పంచుకున్నారు. “స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా.. భారతదేశం స్వాతంత్ర్యం యొక్క నిజమైన సారాంశాన్ని మేల్కొలపాలి. మనం మన పూర్వీకుల దార్శనికతకు కట్టుబడి ఉండాలని అన్నారు. మన భవిష్యత్ తరాల ఆకాంక్షలను హృదయంలో ఉంచుకోవాలి. నా తోటి పౌరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు .. జై హింద్!" అంటూ ట్విట్ చేశారు. అదే విధంగా.. మేము, భారతదేశ ప్రజలు, వారి పవిత్ర వారసత్వాన్ని కాపాడుకోవాలి. మన ప్రజాస్వామ్య విలువలు, ప్రజల హక్కుల గౌరవాన్ని నిలబెట్టాలని పిలుపు నిచ్చారు.

First published:

Tags: Independence Day 2022, Mamata Banerjee, VIRAL NEWS, West Bengal

ఉత్తమ కథలు