Home /News /trending /

VIRAL VIDEO MAMA MONKEY SAVES HER BABY FROM CHOKING TO DEATH BY USING THIS BRILLIANT METHOD PAH

వావ్.. అద్భుతమైన ట్రిక్.. తన బిడ్డ ప్రాణాలు కాపాడిన తల్లి కోతి.. వైరల్ గా మారిన వీడియో..

పిల్లకోతిని కాపాడుతున్న తల్లి

పిల్లకోతిని కాపాడుతున్న తల్లి

Viral video: పిల్లకోతి ఏవో గింజలను తింది. ఆ తర్వాత ఊపిరి పీల్చుకొవడానికి తెగ ఇబ్బంది పడింది. తల్లి మనసు విలవిల్లాడిపోయింది. అప్పుడు తల్లి కోతి కాస్త స్మార్ట్ గా థింక్ చేసింది. తను చేసిన పని వైరల్ గా మారింది.

మనం అంతా కోతుల నుంచి పరిణామం చెందుకుంటూ వచ్చాం. అయితే.. కోతులు అచ్చం మనలాగే పనులు చేస్తుంటాయి. కోతులు కొన్నిసార్లు మన ఇళ్లకు వస్తుంటాయి. అప్పుడు ఇళ్లలోని సామానులను లాక్కెళ్తుంటాయి. తినే పదార్థాలను లాక్కెళ్లి.. ఇంటి మీద పెట్టుకుని మరీ తింటుంటాయి. అవి కొన్ని ఫలాలను తినటేప్పుడు వాటిలోని గింజలను తీసేసీమరీ తింటుంటాయి. కొన్ని రకాల ఫ్రూట్స్ ల తొక్కలు తీసేసి ఆరగిస్తుంటాయి. కోతులు (monkey)  తమ బిడ్డలను ఒక్కనిముషంకూడా వదిలిఉండవు. వేరేకోతులు గానీ, మనుషులు కానీ తమ పిల్లకోతులవైపు చూసిన దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాయి.

కొన్నిసార్లు... కోతులు ప్రమాదాలకు గురౌతుంటాయి. అప్పుడు.. వాటి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా జరిగాయి. అలాంటి సందర్భాలలో.. కోతులు కొన్ని రోజులు వాటి దగ్గరే ఉండటం లేదా చనిపోయిన కోతిని తీసుకెళ్లడం వంటి అనేక సంఘటనలు వార్తలలో నిలిచాయి. తాజాగా, ఒక కోతి తన బిడ్డ ప్రాణాలను కాపాడింది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా (viral video) మారింది.





పూర్తి వివరాలు.. పిల్లకోతి కొన్ని గింజలను నోట్లో వేసుకుంది. కాసేపటికి అది ఇబ్బంది పడుతుంది. పాపం..పిల్ల కోతి మింగిన గింజలను కక్కేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ సాధ్యం కావడం లేదు. ఇదంతా తల్లికోతి గమనించింది. వెంటనే పిల్లకోతిని గట్టిగా పట్టుకుంది. తన రెండు చేతుల్లో తన బిడ్డను పట్టుకుంది.

కడుపులో తట్టుకున్న పదార్ధాలు బయటకు వచ్చే విధంగా.. దాన్ని కాస్త పైకి, కిందకు ఊపింది. దీంతో పిల్లకోతి మింగిన గింజలను నోటి నుంచి బైటక్ వచ్చింది. ఇలా పలు మార్లు చేసింది. దీంతో గింజలు కడుపు నుంచి బయటకు పడిపోవడంతో పిల్లకోతి ఊపిరిపీల్చుకుంది. ఆ తర్వాత.. తల్లిని కౌగిలించుకుని ఆడుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా (viral video) మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Monkeys, Viral Video

తదుపరి వార్తలు