Home /News /trending /

VIRAL VIDEO MADHYA PRADESH THIEF BOWS TO TEMPLE IDOL BEFORE STEALING DONATION BOXES PAH

ఈ దొంగ రూటే సపరేటు.. ఆలయంలో చోరీకి ముందు ఏంచేశాడో తెలుసా..?.. వీడియో వైరల్..

చోరీకి పాల్పడుతున్న వ్యక్తి

చోరీకి పాల్పడుతున్న వ్యక్తి

Madhya pradesh: స్థానికంగా ఉన్న ఆలయంలో ఒక వ్యక్తి చోరీకి వచ్చాడు. ముఖం కనపడకుండా మాస్క్ ధరించాడు. ఆ తర్వాత.. అక్కడ తనతో పాటు తీసుకొచ్చిన బ్యాగ్ ను తీశాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Madhya Pradesh, India
కొందరు దొంగలు కూడా కొన్నిరకాల సెంటిమెంట్ లను కల్గి ఉంటారు. వారు దొంగ తనాలకు వెళ్లిన ప్రదేశంలో వింతగా ప్రవర్తిస్తుంటారు. ఇప్పటి వరకు ఇలాంటి ఎన్నో ఘటనలు వార్తలలో నిలిచాయి. కొందరు.. ఇంట్లో దొంగతనాలకు వెళితే.. అక్కడ ఉన్న పదార్థాలను తింటుంటారు. అంతేకాకుండా.. అక్కడ పూజలు చేస్తుంటారు. మరికొందరు.. దేవుని ప్రతిమ దగ్గర పూలు పెడుతుంటారు. అంతే కాకుండా.. రకారకాల పూజలు చేస్తుంటారు. ఆ తర్వాత.. వచ్చిన పని కానిస్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. మధ్య ప్రదేశ్ లోని (Madhya pradesh)  జబల్ పూర్ లో వెరైటీ ఘటన జరిగింది. అక్కడ ఉన్న ఆలయంలో జరిగిన దొంగ తనం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక వ్యక్తి.. చొక్కా లేకుండా ఆలయంలోకి ప్రవేశించాడు. అతని తలకు మాస్క్ ధరించి ఉన్నాడు. అంతే కాకుండా.. లోపల గర్భగుడి ముందు దేవత దగ్గర చేరుకున్నాడు. అక్కడ అమ్మవారికి నమస్కరించాడు. ఆ తర్వాత.. విరాళాలు, విలువైన వస్తువులను తన బ్యాగులో వేసుకుని చోరీ చేశాడు. ఆగస్టు 5న ఈ ఘటన జరిగింది.



ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో ఇది కాస్త వెలుగులోనికి వచ్చింది. పోలీసుల ప్రకారం.. స్థానికులు అమ్మవారికి సమర్పించిన రెండు పెద్ద గుడి గంటలు, ప్రసాదాలను కూడా దొంగ దొంగిలించాడు. వీడియో కనిపించిన తర్వాత ట్విట్టర్ వినియోగదారులకు పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ గా (Viral video) మారింది.

ఇదిలా ఉండగా పెళ్లిలో కొత్త జంట చేసిన పనిప్రస్తుతం ఫన్నీగా మారింది.

పెళ్లి వేడుక గ్రాండ్ గా జరుగుతుంది. కొత్త జంట అదిరిపోయే కాస్టూమ్ వేసుకున్నారు. ఇద్దరు కూడా కుంకుమ రంగులో మ్యాచింగ్ వస్త్రాలు ధరించారు. అతిథులు, బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున హజరయ్యారు. అప్పుడు కొత్త జంట ఒకరి నోటిలో మరోకరు తీపి పదార్థాలను తినిపించుకుంటున్నారు. అప్పుడు షాకింగ్ ఘటన జరిగింది. వరుడి నోట్లో వధువు.. ప్లేట్ లో ఉన్న స్వీట్ పెట్టడానికి ట్రై చేసింది. కానీ దీనికి వరుడు నిరాకరించాడు. ఆమెకు అందకుండా దూరంగా జరిగాడు.

దీంతో వధువు చిర్రెత్తుకొచ్చింది. అతని మీద పడి మరీ తినిపించడానికి ట్రైచేసింది. దీంతో ఇద్దరు ఒకరిని మరోకరు తోసుకుంటున్నారు. సరదాగా చేసిన పనికాస్త.. కొత్త జంట కొట్టుకొవడం వరకు వెళ్లింది. అక్కడ ఉన్న వారు.. ఆపడానికి ప్రయత్నించినప్పటికి ఎవరు తగ్గడంలేదు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. అవాక్కవుతున్నారు.. మరికొందరు.. ఇదేందిరా నాయన అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Madhya pradesh, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు