కొన్ని సార్లు రైలు సమయానికి రాదు. మనం ఎక్కడ మిస్ అవుతుందోనని పరిగెత్తుకుంటూ ప్లాట్ ఫామ్ (Railway station) మీదకు వెళ్లి చూస్తూ.. అప్పుడు మెల్లగా గంటనో, అరగంటనో ఆలస్యం అని అనౌన్స్ చేసి మరీ చెబుతుంటారు. మరికొన్ని సార్లు.. మనం రైల్వేస్టేషన్ వెళ్లక ముందే రైలు వెళ్లి పోతుంది. మనమే ఏదో కారణంతో రైలును మిస్ చేసుకుంటాం. అయితే, కొందరు రైలు సమయం కన్న రైల్వే స్టేషన్ వెళ్తుంటారు. అప్పుడు ట్రైన్ వస్తే తెగ సంబరపడిపోతారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
मजामा!
Happy Journey 🚉 pic.twitter.com/ehsBQs65HW
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) May 26, 2022
పూర్తి వివరాలు.. ఈ వింత ఘటన మధ్యప్రదేశ్ లోని (Madhya pradesh) రత్లామ్ (Ratlam Station) రైల్వేస్టేషన్ లో జరిగింది. కొంత మంది ప్రయాణికులు బాంద్రా, హరిద్వార్ ఎక్స్ ప్రెస్ కోసం రత్లాం స్టేషన్ కు రాత్రి చేరుకున్నారు. అయితే, దాని సమయంకంటే ముందే ప్లాట్ ఫామ్ మీదకు చేరుకుంది. దీంతో ప్రయాణికులు ఫుల్ ఖుషీ అయ్యారు. అంటే రైలు దాదాపు అరగంట పాటు ప్లాట్ ఫామ్ మీద ఉంటుంది. అరగంట ముందు ట్రైన్ వచ్చందన్నమాట. రైలులో కొంత మంది గుజరాత్ కు (Gujarat passengers) చెందిన ప్రయాణికులు ఉన్నారు. వారు ఒక్కసారిగా ప్లాట్ ఫామ్ మీదకు చేరుకున్నారు.
గార్బా డ్యాన్స్ (Garba dance) చేయడం ప్రారంభించారు. వారితో మరికొంత మంది కలిశారు. వీరంతా గార్బాడ్యాన్స్ చేస్తు ప్యాసింజర్ లను షాక్ కు గురిచేశారు. ఆ తర్వాత.. దీన్ని వీడియో తీసి.. కేంద్ర రైల్వే మంది అశ్విని వైష్ణవ్ కు, ఫేస్ బుక్ లో ట్యాగ్ చేశారు. దీన్ని ఆయన తన ఫేస్ బుక్ లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఒకప్పుడు డ్యాన్స్ కోసం వేదిక, వెడ్డింగ్ కోసం చూసేవారు. కానీ ఇప్పుడు మాత్రం డ్యాన్స్ కోసం స్పెషల్ గా పరిస్థితులున క్రియేట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట (Viral video) తెగ హల్ చల్ చేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Madhya pradesh, Trains