హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

వామ్మో.. ఏనుగును సింగిల్ చేసి.. 14 సింహాల దాడి.. వేట మాములుగా లేదుగా.. వీడియో వైరల్..

వామ్మో.. ఏనుగును సింగిల్ చేసి.. 14 సింహాల దాడి.. వేట మాములుగా లేదుగా.. వీడియో వైరల్..

ఏనుగు మీద దాడిచేస్తున్న సింహాలు

ఏనుగు మీద దాడిచేస్తున్న సింహాలు

Viral video: ఏనుగు తన గుంపు నుంచి విడిపోయింది. అంతలో దాన్ని కొన్ని సివంగీలు గమనించాయి. అప్పుడు అవి మూకుమ్మడిగా ఏనుగుపై దాడికి తెగబడ్డాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Rajasthan, India

అడవికి సింహాన్ని రాజని చెప్పుకుంటారు. పొరపాటున అడవిలో.. సింహం కంట ఏ ఇతర జంతువు అయిన పడితే దానికి మూడినట్లే. అడవిలో ఉండే ఏ ఒక్క జంతువు కూడా, సింహాం దరిదాప్పుల్లో కూడా వెళ్లడానికి సాహాసించవు. సింహాలు... పెద్ద దున్నపోతులు, జిరాఫీలు, జింకలు, అనేక రకాల జంతువులను వేటాడి తింటుంటాయి. అవి గుంపులుగా తిరుగుతుంటాయి. గుంపుకు ఒకటి లేదా రెండు సింహాలు నాయకుడిగా ఉంటాయి. అవి ఉన్న అడవి పరిధిలోనికి ఇతర సింహాలు (lions)  రావడానికి ఇష్టపడవు. ఆయా ప్రాంతంలో మలమూత్ర విసర్జన చేసి.. అది తమ ప్రాంతంగా అవతలి జంతువుకు హెచ్చరిస్తుంటాయి.


అయితే.. కొన్నిసార్లు సింహాలు అడవిలో ఉండే ఏనుగులను కూడా వేటాడుతుంటాయి. కానీ ఏనుగులో అంత ఈజీగా ఏ ఇతర జంతువులు వేటాడలేవు. అయితే.. కొన్నిసార్లు గున్న ఏనుగులు లేదా తమ గుంపు నుంచి విడిపోయిన ఏనుగులపై సింహాలు దాడులు చేస్తుంటాయి. అది కూడా కనీసం పదుల సంఖ్యలో సింహాలు దాడిచేస్తే.. ఏనుగు లొంగే అవకాశం ఉంది. కానీ కొన్నిసార్లు.. సింహాలు ఏన్ని ఉన్న కూడా ఏనుగు ప్రతిఘటిస్తుంది. ఈ కోవకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా (viral video)  మారింది.

పూర్తి వివరాలు.. అడవిలో ఒక ఏనుగు తమ గుంపునుంచి విడిపోయినట్లుంది. అది మెల్లగా అక్కడ ఉన్న నీటిని తాగడానికి వచ్చింది. అప్పుడు అది అక్కడే ఉన్న ఆకలితో ఉన్న సివంగీల కళ్లలో పడింది. దాదాపు.. డజనుకు పైగా ఆడ సింహాల గుంపు, ఏనుగుపైన దాడిచేశాయి. అంతే కాకుండా.. ఒకదాని తర్వాత.. మరోకటి ఏనుగుపైన ఎక్కి కూర్చున్నాయి. ఏనుగును (Elephant) ఎలాగైన తినేయాలని అవి గుంపులుగా దాడి చేస్తున్నాయి. ఏనుగు కూడా ఏమాత్రం భయపడకుండా సింహాల గుంపును తన చెవులతో భయపెడుతూ... గట్టిగా ఘీంకరిస్తూ అక్కడి నుంచి తరిమేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియోను.. ఐఏఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్త వైరల్ గా మారింది.


Published by:Paresh Inamdar
First published:

Tags: Elephant, Lions, VIRAL NEWS, Viral Video

ఉత్తమ కథలు