Home /News /trending /

VIRAL VIDEO LITTLE MONKEY LEFT FASCINATED BY A SMARTPHONE TRIES TO SNATCH IT FROM HUMAN PAH

OMG: స్మార్ట్ ఫోన్ కోసం కక్కుర్తి పడుతున్న పిల్లకోతి.. ఫన్నీ వీడియో వైరల్..

స్మార్ట్ ఫోన్ లో కోసం పిల్లకోతి పాట్లు

స్మార్ట్ ఫోన్ లో కోసం పిల్లకోతి పాట్లు

Viral Video: కోతి తన పిల్లతో సహా అడవిలో ఉంది. ఇంతలో అక్కడికి వచ్చిన కొందరు సరదగా వాటికి బటానీలు తిన్పిస్తున్నారు. అప్పుడు ఒక ఫన్నీ ఘటన చోటు చేసుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Tamil Nadu, India
మనలో చాలా మంది స్మార్ట్ ఫోన్ కు అడిక్ట్ అయ్యారు. దైనందిక జీవితంలో స్మార్ట్ ఫోన్ కూడా ఒక భాగమైపోయింది. ఒక నిముషం కూడా ఫోన్ కన్పించకపోతే గాబారా పడిపోతుంటారు. మరికొందరైతే బాత్రూమ్ లకు వెళ్లేటప్పుడు కూడా స్మార్ట్ ఫోన్ లను తమతో పాటు తీసుకెళ్తుంటారు. పొరపాటున తమ మొబైల్ ఎవరైన తీసుకుంటే.. ఇక యుద్దమే. అంతే కాకుండా.. జర్నీలో కూడా ఎక్కడ చార్జింగ్ ఐపోతుందో అని.. పవర్ బ్యాంక్ లను కూడా తమ వెంట తీసుకెళ్తుంటారు. అయితే.. మనుషులే కాదు.. నోరులేని జీవాలు కూడా మొబైల్ ఫోన్ లకు అడిక్ట్ అయిన అనేక సందర్బాలు వార్తలలో నిలిచాయి. ఇప్పటికే అనేక జంతువులు స్మార్ట్ ఫోన్ లకు (Smart phone)  పోజులిస్తు సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా మారాయి. ఈ కోవకు చెందిన మరో వీడియో వెలుగులోనికి వచ్చింది.

పూర్తి వివరాలు.. కొందరు వ్యక్తులు సరదాగా అడవిలోకి వెళ్లారు. అక్కడ అనేక చెట్లు ఉన్నాయి. అక్కడ అందమైన ప్రదేశాలను తమ ఫోన్ లలో రికార్డు చేస్తున్నారు. కోతులు చెట్ల మీద, కింద ఆకులను తింటున్నాయి. అక్కడికి వచ్చే పర్యాటకులు కోతులకు తినడానికి అనేక పదార్థాలను తరచుగా పెడుతుంటారు. కోతులు వారు పెట్టిన పదార్థాలను చకచక తినేస్తాయి. ఇప్పుడు కూడా.. కొంత మంది కోతుల దగ్గరకు వెళ్లారు. వీరిని చూడగానే కోతులు పరిగెత్తుకుంటూ వచ్చాయి.





దీన్ని వారు వీడియో తీస్తున్నారు. అప్పుడు.. ఒక తల్లికోతి తన పిల్లతో సహా అక్కడికి వచ్చింది. దీన్ని టూరిస్ట్ వీడియో తీస్తున్నాడు. పిల్లకోతి ఫోన్ ను తన చేతిలో తీసుకొవడానికి ప్రయత్నిస్తుంది. అయితే.. తల్లికోతి వారిస్తున్న పిల్లకోతి అసలు పట్టించుకోవడం లేదు. తోక పట్టుకుని వెనక్కు లాగుతున్న పిల్లకోతి ఏమాత్రం తగ్గడం లేదు. ఫోన్ లో తన ప్రతిబింబం చూసుకుంటూ మురిసిపోతుంది. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో వైరల్ గా (Viral video) మారింది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నంద తన ట్వీటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇది  కాస్త వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Monkeys, Viral Video

తదుపరి వార్తలు